వల్లభనేని వంశీ భార్య పంకజ శ్రీ.. హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.. వల్లభనేని వంశీ అరెస్ట్ అక్రమమని పేర్కొన్న ఆమె.. వంశీని అరెస్ట్ చేసిన సమయంలో పటమట పోలీస్ స్టేషన్ సీసీటీవీ ఫుటేజ్ ను భద్రపరిచాలని పంకజ శ్రీ తన పిటిషన్‌లో పేర్కొన్నారు..
వల్లభనేని వంశీ మోహన్‌కు అనారోగ్య సమస్యలు ఉన్నాయి.. ఒంటరిగా ఉంచి డిప్రెషన్‌కు గురయ్యేలా చేస్తున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు వంశీ భార్య పంకజ శ్రీ.. విజయవాడ సబ్ జైలులో ఉన్న వంశీని ఈ రోజు ములాఖత్‌లో కలిశారు పంకజ శ్రీ, వైసీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్ర శేఖర్.. ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన పంకజ శ్రీ.. వంశీకి ఆస్తమా, ఫిట్స్ వంటి అనారోగ్య సమస్యలు ఉన్నాయి.
Vallabhaneni Vamsi Wife: విజయవాడలోని కోర్టు దగ్గర వల్లభనేని వంశీ భార్య పంకజశ్రీ మాట్లాడుతూ.. మూడు రోజులు కోర్టు అనుమతించిన పోలీస్ కస్టడీ తర్వాత మళ్లీ వంశీని న్యాయస్థానం నుంచి సబ్ జైలుకు తరలించడం జరిగిందన్నారు. మూడు రోజులు పోలీసులు కస్టడీలో నా భర్తను అర్థం పర్థం లేని కేసుకు సంబంధం లేని ప్రశ్నలతో విసిగించారు అని ఆరోపించింది.
విజయవాడ జైలులో ఉన్న వల్లభనేని వంశీని ములాఖత్‌లో కలిశారు ఆయన భార్య పంకజ శ్రీ, మాజీ మంత్రి పేర్ని నాని.. ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు.. వంశీని కలిశాం.. కింద పడుకోవడం కొంచం ఇబ్బందిగా ఉంది.. గట్టు ఉన్న ప్రదేశం కేటాయించామని రిక్వస్ట్ చేశామని తెలిపారు పేర్ని నాని.. పరిపాలనలో ఉన్న రాజకీయ నాయకులను సంతృప్తి పరచడం, మానసింకంగా ఆనంద పరచడం కోసం వైసీపీ నేతలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని విమర్శించారు..
విజయవాడ జిల్లా జైలులో వల్లభనేని వంశీ చాలా ధైర్యంగా ఉన్నారని ఆయన సతీమణి పంకజశ్రీ తెలిపారు. లీగల్‌గా తాము చూసుకుంటాం అని, భయపడవద్దు అని వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ దైర్యం చెప్పారన్నారు. బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నామని, చట్ట ప్రకారం ముందుకు వెళ్తున్నామని చెప్పారు. దయచేసి మహిళల మీద సోషల్ మీడియాలో అసభ్యంగా పోస్టులు పెట్టవద్దని పంకజశ్రీ కోరారు. విజయవాడ గాంధీనగర్‌లోని జిల్లా జైలులో భర్త వంశీని ములాఖత్‌లో పంకజశ్రీ కలిశారు. దాదాపు 30…