కొత్త టెర్రరిస్ట్ లీడర్‌ను సృష్టించిన పాకిస్థాన్..
ఎన్నిసార్లు కొట్టిన చావని పాము లాంటిది ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న ఉగ్రవాదం. నిజానికి ఆపరేషన్ సింధూర్ తర్వాత టాప్, వాంటెడ్ టెర్రరిస్ట్‌లు అయిన హఫీజ్ సయీద్, మసూద్ అజార్ వంటి వారు పాకిస్థాన్‌లో అజ్ఞాతంలోకి వెళ్లారు. ఇదే టైంలో పాకిస్థాన్ ఒక కొత్త టెర్రరిస్ట్ లీడర్‌ను సృష్టించింది. ఇంతకీ ఆయన ఎవరు, ఎందుకని ఆయనకు పాకిస్థాన్ సైన్యం మద్దతు ఉందని చెబుతున్నారు.. ఇవన్నీ ఈ స్టోరీలో తెలుసుకుందాం. ఈ కొత్త టెర్రరిస్ట్ లీడర్ పేరు ఖారీ మొహమ్మద్ యాకూబ్ షేక్. ఇతను లష్కర్ నుంచి ఉగ్ర శిక్షణ పొందిన వాడు. ప్రస్తుతం యాకూబ్ తన సొంత సంస్థను ఏర్పాటు చేసుకున్నాడు. పలు నివేదికల ప్రకారం.. ఆయన ఆధ్వర్యంలో ఏర్పాటైన ఈ కొత్త ఉగ్రసంస్థ పేరు సెంట్రల్ ముస్లిం లీగ్. నిజానికి ఇది పాకిస్థాన్‌లో ఒక రాజకీయ పార్టీగా నమోదు అయ్యింది. అలాగే దీనికి ఆ దేశ సైన్యం మద్దతు కూడా ఉందని చెబుతారు.
12 రోజుల విచారణలో విస్తుపోయే నిజాలు.. 28 వేల సినిమాలు, ఫోర్జరీ డాక్యుమెంట్లు.!
ఐబొమ్మ వెబ్‌సైట్ ద్వారా సినిమా ఇండస్ట్రీకి కోట్లాది రూపాయల నష్టం చేకూర్చిన ఇమంది రవి కస్టడీ సోమవారంతో ముగిసింది. గత 12 రోజులుగా పోలీసులు రవిని ముమ్మరంగా ప్రశ్నించారు. ఈ విచారణలో కేవలం పైరసీ మాత్రమే కాకుండా, రవి ‘ఐడెంటిటీ థెఫ్ట్’ (గుర్తింపు దొంగతనం) కు కూడా పాల్పడినట్లు స్పష్టమైన ఆధారాలు లభించాయి. గతంలో రవి పోలీసులకు చెబుతూ.. ప్రహ్లాద్ అనే వ్యక్తి తన రూమ్ మేట్ అని, అతని పేరుతోనే లావాదేవీలు జరిగాయని నమ్మబలికాడు. అయితే, పోలీసులు బెంగళూరు నుంచి ప్రహ్లాద్‌ను రప్పించి రవి ఎదుటే విచారించగా అసలు రంగు బయటపడింది. తనకు రవి ఎవరో తెలియదని, అసలు తామిద్దరం ఎప్పుడూ కలవలేదని ప్రహ్లాద్ తేల్చి చెప్పాడు. సోషల్ మీడియాలో దొరికిన ప్రహ్లాద్ పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ వివరాలను ఉపయోగించి రవి నకిలీ డాక్యుమెంట్లు సృష్టించినట్లు పోలీసులు గుర్తించారు. తన పేరుతో ఇన్ని అక్రమాలు జరిగాయని తెలుసుకున్న ప్రహ్లాద్ షాక్‌కు గురయ్యాడు.
మేడారం కొత్త గద్దెలను చూశారా.? ప్రభుత్వం చేస్తున్న భారీ ఏర్పాట్లు ఇవే.!
ఆసియాలోనే అతిపెద్ద గిరిజన పండుగగా ప్రసిద్ధి చెందిన మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర 2026 నిర్వహణకు తెలంగాణ ప్రభుత్వం అప్పుడే భారీ స్థాయిలో కసరత్తును ప్రారంభించింది. రెండేళ్లకు ఒకసారి వచ్చే ఈ వనదేవతల జాతరను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రభుత్వం, కోట్లాది మంది భక్తులు తరలివచ్చే ఈ మహా క్రతువును ఎటువంటి ఆటంకాలు లేకుండా నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఫిబ్రవరి మాసంలో నాలుగు రోజుల పాటు అత్యంత వైభవంగా సాగే ఈ జాతరలో భాగంగా, మొదటి రోజు కన్నెపల్లి నుంచి సారలమ్మ దేవత గద్దెపైకి రాకతో ఉత్సవం ప్రారంభమవుతుంది. రెండవ రోజు చిలుకలగుట్ట నుంచి భరిణె రూపంలో సమ్మక్క దేవతను గద్దెపైకి తీసుకువచ్చే ఘట్టం జాతరకే అత్యంత ప్రధానమైనది. మూడవ రోజు దేవతలు ఇద్దరూ గద్దెలపై కొలువుదీరి భక్తులకు దర్శనమివ్వగా, నాల్గవ రోజు వన ప్రవేశంతో ఈ మహా జాతర ముగుస్తుంది.
టాలీవుడ్ హీరోయిన్ మాధవీలతపై కేసు
నటిగా గుర్తింపు తెచ్చుకున్న మాధవీలత, గత కొంతకాలంగా సామాజిక మరియు రాజకీయ అంశాలపై చాలా ఘాటుగా స్పందిస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. అయితే, ఈసారి ఏకంగా దైవంగా భావించే సాయిబాబాపైనే అభ్యంతరకర పోస్టులు పెట్టారన్న ఆరోపణలు రావడంతో పెను వివాదం తెర మీదకు వచ్చింది. తాజాగా సినీ నటి మాధవీలత చుట్టూ కొత్త వివాదం నెలకొంది. సోషల్ మీడియా వేదికగా ఆమె చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు పోలీస్ స్టేషన్ వరకు వెళ్లాయి. షిరిడీ సాయిబాబాపై అనుచిత పోస్టులు పెట్టారన్న ఆరోపణలతో ఆమెపై కేసు నమోదైంది.
గెట్ రెడీ.. మన ‘వరప్రసాద్’ గారు దిగుతున్నారు!
ప్రస్తుతం సినిమా తీయడం ఒక ఎత్తైతే.. ఆ సినిమాను జనాల్లోకి తీసుకెళ్లడం మరో ఎత్తు. ఎంత పెద్ద సినిమా అయినా సరే.. సాలిడ్ ప్రమోషన్స్ చేయాల్సిందే. ఇప్పుడు 2026 సంక్రాంతికి రాబోతున్న సినిమాల ప్రమోషన్స్ ఊపందుకున్నాయి. ఇప్పటికే ‘ది రాజా సాబ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించగా.. ఈ ఈవెంట్‌కు రెబల్ స్టార్ ప్రభాస్ రావడంతో భారీ హైప్ వచ్చింది. రాజా సాబ్ జనవరి 9న రిలీజ్ కానుండగా.. 12న మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ విడుదలకు సిద్ధమవుతోంది. షూటింగ్‌కు ముందే వరప్రసాద్ గారు సినిమా ప్రమోషన్స్‌ను దర్శకుడు అనిల్ రావిపూడి మొదలు పెట్టారు. ఇక ఇప్పుడు అసలు సిసలైన ప్రమోషనల్ వేటకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం.. జనవరి 2న సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకోనుంది. ఇక ప్రమోషన్స్ పరంగా మన శంకర వరప్రసాద్ గారు కోసం అనిల్ రావిపూడి రెండు భారీ ఈవెంట్స్ ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అందులో ఒకటి ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కాగా.. మరొకటి ప్రీ రిలీజ్ ఈవెంట్ అని అంటున్నారు. ఈ రెండింటిలో ఒక ఈవెంట్‌ను ఆంధ్రప్రదేశ్‌లో, మరో ఈవెంట్‌ను తెలంగాణలో నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నట్టుగా సమాచారం.
రవి కేసులో బిగ్ ట్విస్ట్: విదేశాల ముచ్చట అబద్ధం..షాకింగ్ విషయం వెలుగులోకి
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ‘ఐబొమ్మ’ వెబ్‌సైట్ నిర్వాహకుడు రవి అరెస్ట్ వ్యవహారంలో ఒక ఆసక్తికరమైన మలుపు తెర మీదకు వచ్చింది. సైబర్ క్రైమ్ పోలీసుల కస్టడీ ముగియడంతో సోమవారం అతడిని కోర్టుకు తరలిస్తుండగా, మీడియా ప్రతినిధులతో రవి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. గత కొంతకాలంగా ఐబొమ్మ రవి విదేశాల్లో తలదాచుకున్నాడని, కరీబియన్ దీవుల్లో నివాసం ఉంటున్నాడని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే, ఈ వార్తలను రవి పూర్తిగా కొట్టిపారేశారు. “మీరు విదేశాల్లో ఎందుకు ఉన్నారు?” అని రిపోర్టర్ ప్రశ్నించగా.. “నేను ఎక్కడికీ వెళ్లలేదు, ఇక్కడే కూకట్‌పల్లిలో ఉంటున్నాను. ఎవరో చెప్పిన మాటలు నమ్మకండి” అంటూ సంచలన సమాధానం ఇచ్చారు.
జిత్తు టు అప్పలసూరి: జగ్గుభాయ్ విశ్వరూపం చూపిన రోల్స్ ఇవే
టాలీవుడ్‌లో వైవిధ్యమైన పాత్రలను అవలీలగా పోషించగల నటులలో జగపతి బాబు కూడా ఒకరు. ఆయన 1989లో ‘సింహస్వప్నం’తో వెండి తెరపైకి హీరోగా అడుగుపెట్టారు. ఆ తర్వాత ‘గాయం’, ‘అంతఃపురం’, ‘సుభలగ్నం’ వంటి సూపర్ హిట్ చిత్రాలతో కుటుంబ కథానాయకుడిగా, యాక్షన్ హీరోగా మంచి పేరు తెచ్చుకున్నారు. కానీ ఆ తర్వాత హిట్లు తగ్గడంతో కెరీర్‌లో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. అయితే 2014లో వెండి తెరపై ప్రభంజనం సృష్టించిన ‘లెజెండ్’ చిత్రంతో ప్రేక్షకులు ముద్దుగా జగ్గుభాయ్‌గా పిలుచుకునే జగపతి బాబు వెండి తెరపై తన
సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశాడు.
శ్రీశైలం భక్తులకు అలెర్ట్.. వసతి గదుల పేరుతో నకిలీ వెబ్సైట్ల దందా..!
శ్రీశైల మల్లికార్జున స్వామి దర్శనానికి వచ్చే భక్తుల భక్తిని ఆసరాగా చేసుకుని సైబర్ కేటుగాళ్లు కొత్త తరహా మోసాలకు తెరలేపారు. దేవస్థానానికి చెందిన ‘మల్లికార్జున సదన్’ వసతి గృహం పేరుతో నకిలీ వెబ్సైట్లను సృష్టించి, గదుల కేటాయింపు పేరుతో భక్తుల నుంచి భారీగా సొమ్ము వసూలు చేస్తున్నారు. ఈ మోసపూరిత వెబ్సైట్ల బారిన పడి ఇప్పటికే పలువురు భక్తులు తీవ్రంగా నష్టపోయారు. కర్ణాటకకు చెందిన గురురాజ్ అనే భక్తుడు ఆన్‌లైన్‌లో వసతి కోసం వెతకగా, మల్లికార్జున సదన్ పేరుతో ఉన్న నకిలీ వెబ్సైట్ కనిపించింది. దానిని అసలైనదిగా నమ్మిన ఆయన, డబ్బులు చెల్లించి రసీదు కూడా పొందారు. అయితే శ్రీశైలం చేరుకున్నాక, రిసెప్షన్‌లో ఆ రసీదు చూపించగా అది నకిలీదని సిబ్బంది తేల్చిచెప్పారు. దీంతో చేసేదేమీ లేక ఆ భక్తుడు తీవ్ర నిరాశతో వెనుతిరగాల్సి వచ్చింది.
“బోయపాటి తాండవం.. బాలయ్య విశ్వరూపం.. సనాతన ధర్మ రక్షణకు ‘అఖండ 2’ దిక్సూచి!”
కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ‘అఖండ 2: తాండవం’ సినిమాను వీక్షించి, చిత్ర యూనిట్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీనుతో కలిసి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ‘అఖండ 2: తాండవం’ స్పెషల్ షోని వీక్షించారు. సినిమా వీక్షించిన అనంతరం ఆయన మాట్లాడుతూ, ఈ చిత్రం కేవలం వినోదం మాత్రమే కాదని, ప్రతి భారతీయుడు, ముఖ్యంగా ప్రతి హిందువు వెన్నెముకను తట్టి లేపే అద్భుత సందేశమని కొనియాడారు. ధర్మ మార్గం తప్పిన వారికి, సనాతన ధర్మంపై అవగాహన లేని వారికి ఈ సినిమా ఒక గొప్ప పాఠంలా నిలుస్తుంది. దేశ సరిహద్దులను సైనికులు కాపాడుతుంటే, దేశం లోపల ధర్మాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత సమాజానిదేనని ఆయన గుర్తుచేశారు. అన్యాయం జరుగుతున్నప్పుడు మౌనంగా ఉండటం కూడా తప్పేనని ఈ సినిమా చాటిచెప్పింది. సమాజానికి మేలు చేసే అంశాలను కమర్షియల్ హంగులతో జోడించి తీయడంలో బోయపాటి శ్రీను సిద్ధహస్తుడని, పరమేశ్వరుడి అనుగ్రహంతోనే ఆయన ఇలాంటి సంచలన చిత్రాలను తీస్తున్నారని ప్రశంసించారు.
ఈ ప్రభుత్వంలో ఆర్యవైశ్యులకు రక్షణ లేదు!
ఆర్యవైశ్యులపై ఈ ప్రభుత్వంలో వేధింపులు పెరిగిపోయాయని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు. పొదిలిలో అవినాష్ అనే యువకుడుపై ఎస్ఐ రక్తం వచ్చేలా కొట్టాడని, ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందితే ఆయన తండ్రి కోటేశ్వర రావును కొట్టారని మండిపడ్డారు. పొదిలి ఎస్ఐపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వైశ్యులపై కక్ష్య సాధింపు, పోలీసుల వేధింపులు పెరిగిపోయాయన్నారు. ఈ ప్రభుత్వంలో ఆర్యవైశ్యులకు రక్షణ లేదని వెల్లంపల్లి శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు.