అసెంబ్లీ ఎన్నికల ముందు బీహార్‌లో మరో దారుణం వెలుగు చూసింది. ఈ మధ్య వరుస హత్యలతో రాష్ట్రం అట్టుడుకుతోంది. తాజాగా అంబులెన్స్‌లో ఓ యువతిపై ఇద్దరు సామూహిక అత్యాచారానికి పాల్పడడం తీవ్ర కలకలం రేపుతోంది.
Dial 112: అత్యవసర సేవల కోసం ఏదైనా అవసరం పడితే మీరు ఇప్పటి వరకు 100కి డయల్ చేసేవారు. అయితే, ఇక మీదట మీరు 100కి కాల్ చేయాల్సిన అవసరం లేదు.. ఎందుకంటే దేశవ్యాప్తంగా కొత్త అత్యవసర నెంబర్ ని ప్రభుత్వం విడుదల చేసింది.
తిరుపతిలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. 108 అంబులెన్స్ భక్తులపైకి దూసుకెళ్లింది. చంద్రగిరి (మం) నరశింగాపురం సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా.. ముగ్గురికి గాయాలయ్యాయి.
నూతన సంవత్సరం వేళ జొమాటోకు చెందిన బ్లింకిట్ మరో కొత్త సేవను ప్రారంభించింది. గురుగ్రామ్‌లో బ్లింకిట్ అంబులెన్స్ సేవలను ప్రారంభించినట్లు సీఈవో అల్బిందర్ ధిండ్సా ఎక్స్‌లో పేర్కొన్నారు
Ambulance Blast: మహారాష్ట్రలోని జల్గావ్ జిల్లాలో బుధవారం సాయంత్రం జరిగిన ఈ ప్రమాదంలో ఓ గర్భిణి, ఆమె కుటుంబ సభ్యులు తృటిలో బయటపడ్డారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. అయితే, అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. గర్భిణిని, ఆమె కుటుంబాన్ని ఎరండోల్ ప్రభుత్వ ఆసుపత్రి నుండి జల్గావ్ జిల్లా ఆసుపత్రికి అంబులెన్స్‌లో తరలిస్తుండగా దాదా వాడి ప్రాంతంలోని జాతీయ రహదారిపై ఫ్లై ఓవర్‌పై ఈ ఘటన జరిగింది. ఉన్నటుండి…
వాహనదారులకు బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు గుడ్‌న్యూస్ చెప్పారు. అత్యవసర సేవలు అందించే అంబులెన్స్‌ల కోసం సహాయ చేసే వాహనదారులకు జరిమానాలు రద్దు చేస్తామని ప్రకటించింది. ఎమర్జెన్సీ సమయంలో అంబులెన్స్‌లకు దారి ఇచ్చేందుకు వాహనదారులు రెడ్‌సిగ్నల్ జంప్ చేస్తున్నారు.
మలక్‌పేట్ రైల్వే బ్రిడ్జి కింద వర్షపు నీటిలో అంబులెన్స్ ఆగిపోయింది. రైల్వే బ్రిడ్జి కిందకు భారీగా వరద నీరు చేరగా.. అంబులెన్స్ అక్కడి నుంచి వెళ్లే సమయంలో ఇంజిన్‌లోకి నీరు చేరింది.
కేరళలోని కోజికోడ్‌లో మంగళవారం ఉదయం ఘోర ప్రమాదం జరిగింది. ప్రాణాలను కాపాడుకునేందుకు ఓ రోగిని.. అంబులెన్స్ లో ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యంలోనే మంటల్లో కాలిపోయింది. ప్రమాదవశాత్తు అంబులెన్స్ విద్యుత్ స్తంభాన్ని ఢీకొని మంటలు చెలరేగాయి. ఈ క్రమంలో.. అంబులెన్స్‌లో ఉన్న మహిళా రోగి సజీవ దహనమైంది.
కేరళలో ఘోర ప్రమాదం జరిగింది. కాసర్‌గోడ్‌లో అంబులెన్స్‌ను కారు ఢీకొనడంతో ముగ్గురు మృతి చెందారు. మృతులు త్రిసూర్‌లోని ఇరింజలకుడాకు చెందిన శివకుమార్ (54), అతని కుమారులు శరత్ (23), సౌరవ్ (15)గా గుర్తించారు.
అత్తగారింటికి వెళ్లేందుకు మద్యం మత్తులో 108కు కాల్ చేశాడు ఓ మందుబాబు. తప్పతాగి అర్థరాత్రి 108కు మందు బాబు ఫోన్ చేసిన ఘటన హైదరాబాద్-వరంగల్ జాతీయ రహదారిపై రాయగిరిలో చోటుచేసుకుంది. కాళ్లలో నొప్పి వేస్తోందని, నడవలేకపోతున్నానని ఓ వ్యక్తి 108 అంబులెన్స్‌కు కాల్ చేశాడు. దీంతో క్షణాల్లో ఫోన్ చేసిన వ్యక్తి వద్దకు యాదగిరిగుట్ట 108 వాహనం చేరుకుంది.