Jagan Mohan Reddy: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అమరావతిలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా రాష్ట్ర పాలన, అవినీతి, అమరావతిలో జరుగుతున్న దోపిడీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఇందులో భాగంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో మట్టి మాఫియా, ఇసుక మాఫియా వంటి అన్ని రకాల మాఫియాలు రాజ్యమేలుతున్నాయని అన్నారు. తమ హయాంలో వర్షాకాలం కోసం 80 వేల టన్నుల ఇసుక నిల్వ చేసినప్పటికీ, టీడీపీ…