ప్రకాశం జిల్లా కొండేపి నియోజకవర్గంలో వైసీపీలో అంతర్గత పోరు అంతకంతకు పెరిగిపోతోంది. వైసీపీలోని రెండు గ్రూపులు ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా ఉంటున్నాయి. పార్టీ ఇంఛార్జ్‌గా ఎవరు ఉన్నా ఓవర్గం మాత్రమే వారితో కలిసి ఉంటోది. రెండో పక్షం వైరిపక్షంగా మారిపోతోంది. దీంతో కొండేపి వ్యవహారాలు తరచూ వైసీపీ పెద్దలకు తలనొప్పులుగా తయారైంది. ఇప్పుడు ఇంఛార్జ్ మార్పు విషయంలోనూ అదే జరిగింది. మొన్నటి వరకూ కొండేపి వైసీపీ ఇంఛార్జ్‌గా మాదాసి వెంకయ్య ఉన్నారు. 2019 ఎన్నికలకు…
మంత్రి పదవులు దక్కలేదని అలకబూనిన నేతలంతా దారికొస్తున్నారు. సీఎం జగన్‌తో భేటీ అనంతరం.. అధినేతకు విధేయులుగా ఉంటామని ప్రకటిస్తున్నారు. తాజాగా మాజీ హోంమంత్రి సుచరిత కూడా అలక వీడారు. గతంలో బాలినేని శ్రీనివాసరెడ్డి, సామినేని ఉదయభాను, పార్థసారథి, కాపు రాచమంద్రారెడ్డి అసంతృప్తికి గురయిన సంగతి తెలిసిందే. మంత్రి పదవి దక్కకపోవడంతో అసంతృప్తిగా ఉన్న వైసీపీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రుల బుజ్జగింపు ప్రక్రియ కొనసాగుతోంది. అలకబూనిన ఒక్కో నేత… అధినేత దారిలోకి వస్తున్నారు. ఇప్పటికే బాలినేని శ్రీనివాస్‌రెడ్డి, పార్థసారథి,…
ఏపీలో రాజకీయ పరిస్థితులు మారుతున్నాయి. అధికార పార్టీని అసమ్మతి సెగలు కమ్ముకుంటున్నాయి. మంత్రివర్గ విస్తరణ విషయం పార్టీని కుదిపేస్తోంది. అంతా బాగానే వుందని చెబుతున్నా.. పార్టీలో ఏం జరుగుతుందో అర్థం కావడం లేదంటున్నారు నేతలు. నిన్నటి వరకు మాకు ఒక్కడే నాయకుడు అని డప్పులు కొట్టుకున్న పాలకపక్షం నేతలు ఇప్పుడు పదవుల కోసం కొట్లాడుకుంటున్నారని కామెంట్ చేశారు బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు. ఒకే మాట ఒకే బాట అన్న నాయకులు నేడు పదవులకు ఏడుపులు, పెడబెబ్బలు…
ఏపీలో కొత్త కేబినెట్ కూర్పు కొలిక్కి వచ్చినట్టే అని భావిస్తున్నారు. అయితే మంత్రి పదవిని ఆశించినవారు తీవ్ర నిరాశకు, అసంతృప్తికి గురవుతున్నారు. బాలినేని శ్రీనివాసరెడ్డి ఇంటికి ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ఱారెడ్డి వెళ్లారు. ఆయనతో కలిసి మాట్లాడారు. పదవులు రానివారికి బుజ్జగింపుల పర్వం మొదలయ్యిందని అంటున్నారు. బాలినేని నివాసంలో ఎక్కడా సందడి కనిపించడంలేదు. పెద్ద సంఖ్యలో వైసీపీ నేతలు, కార్యకర్తలు బాలినేని నివాసం దగ్గరకు చేరుకుంటున్నారు. కొంత మంది కార్యకర్తలు గేటు బయటే పడిగాపులు పడుతున్నారు.…
ఏపీ రాజకీయాలు కాకరేపుతూనే వున్నాయి. ప్రకాశం జిల్లా కొండపి టీడీపీ ఎమ్మెల్యే బాలవీరాంజనేయ స్వామి ఇంటి ముట్టడికి వైసీపీ నేత అశోక్ బాబు ప్రయత్నించడం ఉద్రిక్తతకి దారి తీసింది. ఎమ్మెల్యే స్వామి ఇంటికి కార్యకర్తలతో వెళ్తున్న వైసీపీ నాయకుడు అశోక్ బాబుని పోలీసులు అడ్డుకున్నారు. అయితే పోలీసులను నెట్టుకుంటూ ముందుకు వెళ్లేందుకు అశోక్ బాబు ప్రయత్నించాడు. దీంతో పోలీసులు, వైసీపీ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. దీంతో 16వ నెంబరు జాతీయ రహదారిపై కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం…