విధాన పరమైన నిర్ణయాల అమల్లో సచివాలయ మహిళా ఉద్యోగులు క్రియాశీలకపాత్ర పోషిస్తున్నారని ప్రభుత్వ సజ్జల రామకృష్ణ రెడ్డి అన్నారు. మంగళవారం ఉమెన్స్ డే సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎవరి ప్రభుత్వం వచ్చినా.. ఆ నిర్ణయాలు అమల్లో మీదే కీలక పాత్ర అని ఆయన వ్యాఖ్యానించారు. సీఎం జగన్ గత మూడేళ్లగా మహిళా సాధికారికతకి కృషి చేస్తున్నారని, చట్ట సభల్లో 33 శాతం రిజర్వేషన్ల కోసం అనేక ఏళ్లుగా పోరాటం జరుగుతుందని, ఏపీలో 50 శాతానికి పైగా మహిళలకి చట్ట సభల్లో రిజర్వేషన్ కల్పించామని ఆయన అన్నారు.
మహిళలపై వేధింపులకి, దాడులకి కఠినమైన దిశ చట్టాన్ని తీసుకొచ్చామని, సీఎం వైఎస్ జగన్ అనేక సంక్షేమ పధకాలని మహిళల కోసమే ప్రవేశపెట్టారన్నారు. కోట్లాది మంది మహిళలకి మీరు స్ఫూర్తిగా నిలవాలని, సమాన హక్కుల కోసం పోరాటంతో పాటు బాధ్యతలపై కూడా తీర్మానించుకోవాలన్నారు. మహిళల సంక్షేమానికి ఆలోచన చేస్తూ కృషిచేస్తున్న ఏకైక వ్యక్తి సీఎం జగన్ అని ఆయన వెల్లడించారు. అట్టడుగు వర్గాల ఉన్నతికి సీఎం జగన్ చేస్తున్న కృషికి సహకారంగా నిలవాలని ఆయన అన్నారు.