RK Roja: వైస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో తాడేపల్లిలోని ఆయన నివాసంలో మాజీ మంత్రి ఆర్కే రోజా సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఇటీవల కాలంలో నగరి నియోజకవర్గంలో నెలకొన్న తాజా పరిణామాలపై ప్రధానంగా చర్చ కొనసాగుతున్నట్లు తెలుస్తుంది. తాజాగా, గాలి ముద్దు కృష్ణమ నాయుడు రెండవ కుమారుడు గాలి జగదీష్ ప్రకాష్ ను వైసీపీలోకి చేర్చుకునేందుకు సన్నాహాలు చేసిన పార్టీ అధిష్టానం.
Read Also: iPhone 16e: మళ్లీరాని ఛాన్స్.. ఐఫోన్ 16eపై రూ. 10 వేల డిస్కౌంట్..
అయితే, గాలి జగదీష్ ప్రకాష్ ను వైసీపీలో చేర్చుకోవడాన్ని మాజీ మంత్రి ఆర్కే రోజా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయటంతో అతడి చేరికకు బ్రేక్ పడింది. ఇక, ఇవాళ (ఫిబ్రవరి 24) అదే అంశంపై రోజాతో మాజీ సీఎం వైఎస్ జగన్ చర్చించినట్లు సమాచారం. ఈ భేటీలో గాలి జగదీష్ ప్రకాష్ చేరికపై కూడా ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. దీంతో నగరి నియోజకవర్గంలో వైసీపీ పార్టీలో తాజాగా నెలకొన్న పరిణామాలు ఆసక్తి రేపుతున్నాయి.