RK Roja: వైస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో తాడేపల్లిలోని ఆయన నివాసంలో మాజీ మంత్రి ఆర్కే రోజా సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఇటీవల కాలంలో నగరి నియోజకవర్గంలో నెలకొన్న తాజా పరిణామాలపై ప్రధానంగా చర్చ కొనసాగుతున్నట్లు తెలుస్తుంది.
ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. మంత్రి ఆర్కే రోజా ప్రాతినిథ్యం వహిస్తున్న నగరి అసెంబ్లీ నియోజకవర్గంలో కొత్త పంచాయతీ తెరపైకి వచ్చింది.. ప్రెస్‌మీట్ పెట్టి మరీ.. మంత్రి రోజాపై సంచలన వ్యాఖ్యలు చేశారు కొందరు నేతలు.. అయితే, వ్యతిరేక వర్గాన్ని దారిలోకి తెచ్చుకునేందుకు ఒకరని సస్పెండ్ చేయించిన రోజాకు.. ఇప్పుడు ఊహించని రీతిలో రివర్స్ షాక్ తగులుతోంది.
నగరిలో మీ ఉత్సాహం చూస్తూ ఉంటే రాష్ట్రానికి మంచి రోజులు వస్తున్నాయని అనిపిస్తోందని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గంలోని పుత్తూరులో ప్రజాగళం సభలో చంద్రబాబు ప్రసంగించారు. ఈ సభలో గాలి భానుప్రకాష్, ఇతర నేతలు పాల్గొన్నారు. నగరి మీటింగ్ చూసిన తర్వాత జగన్ మైండ్ బ్లాక్ అవుతుందన్నారు.
Andhra Pradesh: చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గంలో వర్గపోరు రోజురోజుకు పెరిగిపోతోంది. మంత్రి రోజా ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ నియోజవర్గంలో ఇటీవల వైసీపీ నేతలు రెండు వర్గాలుగా విడిపోయారు. దీంతో నగరి నియోజకవర్గ అసమ్మతి వ్యవహారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి చేరింది. ఈ సందర్భంగా తన నియోజకవర్గంలో ఇటీవల జరిగిన పరిణామాలపై సీఎం జగన్‌కు మంత్రి రోజా ఫిర్యాదు చేశారు. చక్రపాణిరెడ్డి వర్గం నియోజకవర్గంలో తనను బలహీనపరుస్తోందని ఆమె ఆరోపించారు. ఈ అంశంపై ఇప్పటికే మంత్రి…
మంత్రి ఆర్కే రోజా సొంత నియోజకవర్గం నగరిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.. ఓ వైపు దివంగత నేత, మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి జయంతిని పురస్కరించుకుని అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు, కార్యకర్తలు బ్యానర్లు, ఫ్లెక్సీలు కడితే.. మరో వైపు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నిర్వహిస్తోన్న బాదుడే బాదుడు కార్యక్రమం సందర్భంగా పెద్ద ఎత్తున బ్యానర్లు, ఫ్లెక్సీలు పెట్టాయి టీడీపీ శ్రేణులు.. దీంతో.. నగరి టౌన్‌లో ఎటు చూసినా వైసీపీ వర్సెస్ టీడీపీ…