AP Govt : త్వరలో జరగబోయే ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేయనున్నట్లు తెలుస్తుంది. రేపు (ఫిబ్రవరి 17) గుర్తింపు పొందిన సంఘాలతో మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించనున్నారు. సంఘాలతో చర్చించిన తర్వాత ప్రభుత్వానికి ఆయా ఉద్యోగ సంఘాల నుంచి వచ్చే వినతులు, సూచనలను పరిగణనలోకి తీసుకోని తుది నివేదికను అధికారులు ఇవ్వనున్నారు. ఇంజినీరింగ్ బీసీ, ఎస్సీ, ఎస్టీ వెల్ఫేర్ శాఖల్లో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులను తీసుకునే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. ఇతర శాఖల్లోకి వెళ్లే ఆలోచన ఎవరికి ఉంది.. అనే అంశంపై ఆన్ లైన్ లో ఓటింగ్ నిర్వహిస్తున్నాయి కొన్ని సంఘాలు.
Read Also: Rashid Khan-Wasim: వసీం అక్రమ్ కంటే రషీద్ ఖాన్ గొప్ప క్రికెటర్..
అయితే, ఇప్పటికే గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులను జనాభా ప్రాతిపదికన మూడు కేటగిరీలుగా ప్రభుత్వం విభజించింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులను ఏపీ సర్కార్ ఉత్తర్వులను జారీ చేసింది. దీనికి అనుగుణంగా రేషనలైజేషన్ చేపట్టేందుకు చర్యలకు తీసుకుంటుంది. ఇక, 2,500 మంది జనాభా ఉన్న సచివాలయానికి ఏ కేటగిరీ కింద ఆరుగురు, 3,500 వరకు జనాభా ఉన్న సచివాలయానికి బీ కేటగిరీకి ఏడుగురు, 3,500 లకు మించి ఎక్కువగా జనాభా ఉన్న సచివాలయాన్ని సీ కేటగిరీ కింద ఎనిమిది మందిని కేటాయించారు. ఇలా, ఉద్యోగులను విభజించడంతో దాదాపు 40 వేల మంది ఉద్యోగులు మిగిలిపోయారు.. వారినీ ఇతర శాఖల్లో వివిధ అవసరాలకు వినియోగించుకోనుంది ఏపీ ప్రభుత్వం.