హిమాచల్‌ప్రదేశ్‌లో ఇటీవల ఆకస్మిక వరదలు ఎంత బీభత్సం సృష్టించాయో అందరికీ తెలిసిందే. క్లౌడ్ బరస్ట్ కారణంగా ఒక్కసారిగా వరదలు ముంచెత్తాయి. అమాంతంగా వరదలు సంభవించడంతో గ్రామాలకు గ్రామాలే కొట్టుకుపోయాయి. కట్టుబట్టలతో కొందరు ప్రాణాలు కాపాడుకోగా.. ఇంకొందరు ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఇప్పటి వరకు 87 మంది చనిపోగా.. అనేక మంది గాయాలపాలయ్యారు.
నేరాలను అదుపు చేయడంలో పోలీసులు కీలకపాత్ర పోషిస్తుంటారు. గొడవలు జరగకుండా, దొంగతనాలు, దోపిడీలకు అడ్డుకట్ట వేస్తూ శాంతి భద్రతలు పరిరక్షిస్తుంటారు. పోలీసులు లేని సమాజాన్ని ఊహించుకుంటేనే భయంకరంగా ఉంటుంది. సొసైటీకి పోలీసులు చేస్తున్న కృషి మరువలేనిది. ప్రజా సమస్యలను తీర్చేందుకు.. పోలీస్ సేవలను ప్రజల వద్దకు చేర్చేందుకు అందుబాటులో ఉన్న అవకాశాలను ఉపయోగించుకుంటూ ఉంటారు. ఇదే తరహాలో ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు సైకిళ్లపై గ్రామ సందర్శన చేశారు వంగర పోలీసులు. Also Read:Rajnath Singh: ‘‘పాలకు…
AP Govt : త్వరలో జరగబోయే ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేయనున్నట్లు తెలుస్తుంది. రేపు (ఫిబ్రవరి 17) గుర్తింపు పొందిన సంఘాలతో మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించనున్నారు.
సాధారణంగా పట్టణాలతో పోలిస్తే పల్లెల్లో తక్కువ జనాభా నివసిస్తుంటారు. అభివృద్ధి కూడా తక్కువే కాబట్టి పన్నులు కూడా తక్కువ మొత్తంలోనే చెల్లిస్తారు. కాని రాజస్థాన్ లోని ఓ గ్రామంలో పరిస్థితి భిన్నంగా ఉంది. పట్టణాలతో పోలిస్తే జనాభాలో తక్కువే అయినా.. వారు పన్నులు కోట్లులో చెల్లిస్తారు.
Sankranthi: తెలుగువారి పెద్ద పండుగ.. సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. ఇల్లు, ఆఫీసు... ఇలా నాలుగు గోడల మధ్య చిక్కుకుని నగర జీవితానికి అలవాటు పడిన పట్నం వాసులు చాలా మంది పల్లెలకు వెళ్లి అన్నదమ్ములతో కలిసి పండుగ చేసుకున్నారు.
బీహార్‌లోని ఓ గ్రామంలో ఎంత ప్రయత్నించినా అక్కడి అబ్బాయిలకు మ్యారేజ్ లు జరగటం లేదట. జముయి జిల్లా సదర్ ప్రధాన కార్యాలయానికి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న బరుఅట్టా విలేజ్ లో అబ్బాయిలు పెళ్లి చేసుకోవడానికి మాత్రం చాలా కష్టపడుతున్నారంట. ఈ ఊరి యువకులు ఉద్యోగాల కంటే పెళ్లి చేసుకోవడానికే ఎక్కువగా కష్టపడుతున్నారు అని వార్తలు వినిపిస్తున్నాయి.
మహారాష్ట్రలోని రాయ్‌గడ్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. జిల్లాలోని ఓ గ్రామంపై కొండచరిచయలు విరిగిపడటంతో 13 మంది మరణించారు. గురువారం తెల్లవారుజామున జరిగిన ఈ ఘటనలో 100 మందికి పైగా చిక్కుకున్నారు. ఖలాపూర్ తహసీల్‌లోని ఇర్షాల్‌వాడి గ్రామంలోని ఇళ్లపై కొండ రాళ్లు, మట్టిపెళ్లలు పడటంతో అనేక ఇళ్లు నేలమట్టమయ్యాయి. ఈ ప్రమాదంలో మొత్తం 48 కుటుంబాలు చిక్కుకున్నాయి.
మొబైల్ ఫోన్ ఇప్పుడు అందరి జీవితాల్లో ఒక భాగమైపోయింది.. మొబైల్ ఫోన్ చేతిలో ఉంటే చాలు.. ఇక, ఎవ్వరితో పనిలేదు అనేలా పరిస్థితి తయారైంది.. చిన్న, పెద్ద తేడాలేకుండా.. స్మార్ట్‌ఫోన్ లేకుంటే క్షణం కూడా ఉండలేకపోతున్నారు.. ఈ తరుణంలో ఓ గ్రామ పంచాయతీ చేసిన ఏకగ్రీవ తీర్మానం వైరల్‌గా మారిపోయింది.. మహారాష్ట్రలోని యావత్మల్ జిల్లా బన్నీ గ్రామంలో.. 18 ఏళ్ల లోపు చిన్నారులు, యువత మొబైల్ ఫోన్ వాడకంపై నిషేధం విధించారు.. దీనిపై గ్రామ పంచాయతీ ఏకగ్రీవ…