Pawan Kalyan: విశాఖ ఫిషింగ్ హర్బర్‌లో ప్రమాదంపై విశాఖ వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో పోలీసులు విచారణ కొనసాగుతున్న విషయం తెల్సిందే. యూట్యూబర్ లోక ల బాయ్ నాని తన భార్య సీమంతం పార్టీని బోట్ లో గ్రాండ్ గా నిర్వహించడం వలనే ఆ అగ్నిప్రమాదం జరిగిందని సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ అగ్నిప్రమాదాన్ని సైతం వీడియో తీసి యూట్యూబ్ లో పెట్టడంతో లోకల్ బాయ్ నానిపై కేసు నమోదయ్యింది. అగ్ని ప్రమాదం జరగడానికి కారణం కూడా ఇతనే అయ్యి ఉంటాడని అనుమానించిన పోలీసులు ఉదయం అతనిని అరెస్ట్ చేసి తీసుకెళ్లిన విషయం కూడా విదితమే. అయితే విచారణ చేసిన పోలీసులు.. లోకల్ బాయ్ నాని.. ఈ ప్రమాదానికి కారణం కాదని.. అతను నిర్దోషి అని తెలిపినట్లు సమాచారం. ఇక ఈ అగ్నిప్రమాదంపై జనసేనాని పవన్ కళ్యాణ్ స్పందించిన విషయం తెల్సిందే. “విశాఖపట్నంలోని ఫిషింగ్ హార్బర్ లో అర్థరాత్రి చోటు చేసుకున్న అగ్ని ప్రమాదంలో 40 బోట్లు దగ్ధం కావడం దురదృష్టకరం. ఈ ప్రమాదం వల్ల నష్టపోయిన బోట్లు యజమానులను అన్ని విధాలుగా ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను. వీటిపై ఆధారపడ్డ మత్స్యకారులకు జీవన భృతి అందించాల్సిన అవసరం ఉంది. విశాఖ ఫిషింగ్ హార్బర్ లో చోటు చేసుకున్న అగ్ని ప్రమాదంపై విచారణ చేపట్టాలి. భద్రతపరమైన అంశాలపై సమీక్షించి, పటిష్ట చర్యలు తీసుకోవాలని” కోరారు.
Pro Kabaddi League: కండల బలమే ఆయుధంగా.. మైదానమే రణస్థలంగా.. బాలయ్య కబడ్డీ
ఇక తాజాగా విశాఖ షిప్పింగ్ హార్బర్ లో జరిగిన 60కి పైగా బోట్ ల దగ్ధం జరిగి నష్టపోయిన బోట్ లు యజమానులకు వారి కుటుంబాలకు ఆర్థిక సాయం ప్రకరించాడు పవన్ కళ్యాణ్. స్వయంగా తానే నష్టపోయిన కుటుంబాలను కలిసి ఆర్థిక సాయం అందించనున్నట్లు ప్రకటించారు. ” విశాఖ షిప్పింగ్ హార్బర్ లో జరిగిన 60కి పైగా బోట్ల దగ్ధం జరిగి నష్టపోయిన బోట్ లు యజమానులకు వారి కుటుంబాలకు JSP తరుపున నుండి ఏభై వేల రూపాయలు ఆర్దిక సాయం చెయ్యాలని నిర్ణయించుకున్నాను. వచ్చే రెండు మూడు రోజుల్లో నేనే స్వయం గా వచ్చి ఇస్తాను.వారి కుటుంబాలకు జనసేన అండగా ఉంటుంది” అని ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది.
విశాఖ షిప్పింగ్ హార్బర్ లో జరిగిన 60కి పైగా బో ట్ల దగ్ధం జరిగి నష్టపోయిన బోట్ లు యజమానులకు వారి కుటుంబాలకు
JSP తరుపున నుండి ఏభై వేల రూపాయలు ఆర్దిక సాయం చెయ్యాలని నిర్ణయించుకున్నాను. వచ్చే రెండు మూడు రోజుల్లో నేనే స్వయం గా వచ్చి ఇస్తాను.
వారి కుటుంబాలకు జనసేన అండగా ఉంటుంది— Pawan Kalyan (@PawanKalyan) November 21, 2023