MP Mithun Reddy Gives Clarity On AP Early Elections: ఆంధ్రప్రదేశ్‌లో ముందస్తు ఎన్నికలు రావొచ్చన్న ప్రచారానికి తాజాగా రాజంపేట ఎంపీ మిథన్ రెడ్డి చెక్ పెట్టారు. తాము లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌తోనే ఎన్నికలకు వెళతామని క్లారిటీ ఇస్తూ.. ముందస్తు ఎన్నికల ఉండవని పరోక్షంగా చెప్పేశారు. పార్లమెంట్, అసెంబ్లీ కలిపి ఎన్నికలు జరిగితేనే అడ్వాంటేజ్ అని చెప్పుకొచ్చారు. ఆదివారం మిథున్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. కాపు ఉద్యమ నేత, మాజీమంత్రి ముద్రగడ పద్మనాభం తమ వైసీపీలోకి వస్తానంటే, తప్పకుండా స్వాగతిస్తామని తెలిపారు. అయితే.. ముద్రగడ పైన సీఎం స్థాయిలో నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని వెల్లడించారు. ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమం ద్వారా ప్రజల్లోకి వెళ్లే వారికే.. ఈసారి ఎన్నికల్లో సీట్లు ఇస్తామన్నారు. వారే తమ పార్టీ అభ్యర్థులని కూడా తేల్చి చెప్పారు. వైసీపీలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అత్యధిక ప్రాధాన్యత ఉంటుందన్న ఆయన.. ప్రజలతో ఎలాంటి దాపరికాలు లేకుండా ఉండాలనేదే తమ పార్టీ స్ట్రాటజీ అని చెప్పారు. అందుకే.. తమ వల్ల ఉపయోగం ఉంటేనే ఓటు వెయ్యమని సీఎం జగన్ అంటున్నారని పేర్కొన్నారు.
Etala Rajender: పార్టీలు మారడం అంటే.. బట్టలు మార్చినంత ఈజీ కాదు..!
ఇదే సమయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై మిథున్ రెడ్డి విమర్శలు గుప్పించారు. టీడీపీతో పొత్తు ఆశయంలో భాగంగానే.. పవన్ మాట్లాడుతున్నారని అభిప్రాయపడ్డారు. ఆ పార్టీకి ప్రయోజనం చేకూర్చాలన్నదే పవన్ ముఖ్య ఉద్దేశమని వ్యాఖ్యానించారు. తాను ముఖ్యమంత్రి కానని పవన్ గతంలోనే చెప్పారని, తనకు సీఎం అయ్యేంత బలం లేదని స్వయంగా పవనే చెప్పారని గుర్తు చేశారు. అందుకే.. చంద్రబాబుని ముఖ్యమంత్రి చేయాలనే లక్ష్యంతో పవన్ పని చేస్తున్నారన్నారు. అభిమానులు, ప్రజలను రెచ్చగొట్టి, లబ్ది పొందాలని పవన్ చూస్తున్నారని ఆరోపించారు. జనసేన పార్టీ మొత్తం ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తుందో చెప్పాలని డిమాండ్ చేశారు.
Uttarakhand: అదుపుతప్పి నదిలోకి వాహనం.. ఆరుగురు గల్లంతు..