వరంగల్ లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పర్యటన తర్వాత తెలంగాణ బీజేపీలో అంతర్గత విభేదాలు సద్దుమణిగినట్లు కనిపిస్తున్నాయి. దీంతో పాటు పార్టీ పటిష్టత కోసం కమలనాథులు తెలంగాణలో వరుస సమావేశాలు, పర్యటనలు చేస్తున్నారు. ఇక మాజీ మంత్రి ఎ. చంద్రశేఖర్ పార్టీ మారుతున్నారనే ప్రచారంతో బీజేపీ రాష్ట్ర ఎన్నికల కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ ఇవాళ (ఆదివారం) ఆయన నివాసానికి వెళ్లి ఇద్దరు కాసేపు చర్చించుకున్నారు. ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. ఎ. చంద్రశేఖర్ కు మాకు కామన్ ఎజెండా ఉంది.. ఏ, బి, సి, డీ వర్గీకరణకు బీజేపీ కమిట్మెంట్ తో ఉంది అని ఈటల అన్నారు.
Read Also: Nirmala Buch: మధ్యప్రదేశ్ తొలి మహిళా ప్రధాన కార్యదర్శి నిర్మలా బుచ్ కన్నుమూత
బీజేపీ అధిష్టానం చర్చలు జరిపింది.. కర్ణాటకలో హామీ ఇచ్చాం.. తెలంగాణలో కూడా వర్గీకరణకు కృషి చేస్తాం అని ఈటల రాజేందర్ అన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను గద్దె దించడంలో అందరం కలిసి పనిచేస్తామని ఈటల అన్నారు. చంద్రశేఖర్ పార్టీ వీడుతారని మీడియా విష ప్రచారం చేస్తుంది.. పార్టీలు మారడం అంటే బట్టలు మార్చినంత ఈజీ కాదు అని ఈటల అన్నారు. అయితే.. వరంగల్ రీజియన్ వరకే మోడీ మీటింగ్ జరిగింది.. అందుకే చంద్రశేఖర్ కి పాసు రాలేదు.. అంతే తప్ప మరొకటి కాదు అని ఈటల తెలిపారు.
Read Also: Viral Video: ఏం నటన గురూ.. మనుషులను మించిపోయింది..!
ఇక మాజీ మంత్రి డా.చంద్రశేఖర్ మాట్లాడుతూ.. పార్టీ బాగుండాలని చర్చించాం.. మేము తెలంగాణ ఉద్యమంలో పదవులకు రాజీనామా చేసి కొట్లాడి రాష్ట్రం తెచ్చుకున్నాం.. తెలంగాణ బాగుపడాలని మేము చర్చించాము.. తప్ప ఇంకేం లేదని మాజీ మంత్రి చంద్రశేఖర్ అన్నారు. తను పార్టీ మారుతున్నట్లు వస్తున్న దాంట్లో నిజం లేదని మాజీ మంత్రి పేర్కొన్నారు.