తెలుగురాష్ట్రాల్లో సంచలనం కలిగించిన డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో నిందితుడుగా పేర్కొన్న వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు బెయిల్ కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇప్పటికే హైకోర్ట్ బెయిల్ పిటిషన్ రద్దుచేసిన సంగతి తెలిసిందే. తాజాగా బెయిల్ కోసం సుప్రీంకోర్ట్ మెట్లెక్కారు అనంతబాబు. నేడు ఎమ్మెల్సీ అనంతబాబు బెయిల్ పిటిషన్ పై సుప్రీం కోర్టులో విచారణ జరగనుంది. డిఫాల్ట్ బెయిల్ మంజూరు చేయమని సుప్రీంకోర్టును ఆశ్రయించారు అనంతబాబు. దళిత యువకుడు వీధి సుబ్రహ్మణ్యం హత్యకేసులో మే 23 నుంచి రాజమండ్రి సెంట్రల్ జైల్లో అనంతబాబు రిమాండ్ లో వున్నారు.
రాజమండ్రి ఎస్సీ-ఎస్టీ కోర్టు, ఎ.పి హైకోర్టు బెయిల్ పిటిషన్ కొట్టివేయడంతో సుప్రీం కోర్టుకు వెళ్లారు అనంతబాబు. సుబ్రహ్మణ్యం హత్య కేసులో మే 23 నుంచి వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు రాజమండ్రి జైలులో ఉన్న విషయం తెలిసిందే. హైకోర్టులో అనంతబాబుకు మరోసారి చుక్కెదురైంది. అనంతబాబు వేసిన బెయిల్ పిటిషన్‌ను హైకోర్ట్ గతంలోనే డిస్మిస్ చేసింది. గతంలో అనంతబాబు డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ వేయగా… ధర్మాసనం కొట్టివేసింది. పోలీసులు 90 రోజుల్లో ఛార్జ్‌షీట్ వేయనందున బెయిల్ ఇవ్వాలని హైకోర్టును అనంతబాబు కోరారు.
Read Also: Four tigers in Adilabad: ఆదిలాబాద్ జిల్లాలో రోడ్డుపై నాలుగు పులులు.. పరుగులెత్తిన జనం
ఎమ్మెల్సీ అనంతబాబు బెయిల్ పిటిషన్ ను ఏపీ హైకోర్టు గతంలోనే కొట్టివేసింది. ఈ ఏడాది ఆగస్టులో అనంతబాబు తల్లి మంగారత్నం మృతి చెందడంతో ఎస్సీ, ఎస్టీ కోర్టు అనంతబాబుకు బెయిల్ ఇచ్చింది,. తల్లి అంత్యక్రియలు ముగిసిన తర్వాత అనంతబాబు తిరిగి జైలుకు వెళ్లారు. అయితే తల్లి అంత్యక్రియల్లో పాల్గొనేందుకు జైలు నుండి బయటకు వచ్చిన సమయంలోనే తన బెయిల్ ను పొడిగించాలని అనంతబాబు కోరారు. అయితే, అనంతబాబు అభ్యర్ధనను కోర్టు తిరస్కరించింది.
దీంతో ఆయన తిరిగి జైలుకే వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. అనంతబాబు బెయిల్ పైన బయటకు వస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని సుబ్రమణ్యం కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అనంతబాబు బంధువులు తమను బెదిరించారని డ్రైవర్ సుబ్రమణ్యం కుటుంబ సభ్యులు గతంలో పోలీసులకు ఫిర్యాదులు కూడా చేశారు. డ్రైవర్ సుబ్రమణ్యం మరణంతో జీవనోపాధి లేదని కుటుంబ సభ్యులు కోరడంతో ప్రభుత్వం సుబ్రహ్మణ్యం భార్యకు వైద్యఆరోగ్య శాఖలో జూనియర్ అసిస్టెంట్ గా ఉద్యోగం కల్పించింది. మరి, సుప్రీంకోర్ట్ అనంతబాబుకి బెయిల్ ఇస్తుందా? లేదా తిరస్కరిస్తుందా? వేచి చూడాల్సిందే.
Read Also: Cold Wave: చలి వణికిస్తోంది.. పొగ మంచు కమ్ముకుంటోంది