గత నెల 19న డ్రైవర్ సుబ్రమణ్యం హత్య జరిగింది. ఆ తర్వాత నాలుగు రోజులకు ఎమ్మెల్సీ అనంతబాబును అరెస్ట్ చేశారు పోలీసులు. మధ్యలో ఆ నాలుగు రోజులపాటు ఎమ్మెల్సీ పెళ్లిళ్లు, పేరంటాలుకు తిరుగుతూ పెద్ద హంగామానే చేశారు. అరెస్ట్ తర్వాత అనంతబాబు ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఆ సమయంలో ఎమ్మెల్సీ మాట్లాడిన కాల్స్ వ్యవహారంలో ఆసక్తికర చర్చ జరుగుతుంది. ఆ నాలుగు రోజుల్లో అనంతబాబు ఎక్కువగా జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబుతో మాట్లాడారట. చంటిబాబు జగ్గంపేట…
డ్రైవర్ సుబ్రమణ్యం హత్యకేసులో ఎమ్మెల్సీ అనంతబాబును గత నెల 23న అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అప్పటి నుంచి ఆయన రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్‌లో ఉన్నారు. బెయిల్ కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఎమ్మెల్సీ జైలులో ఉన్నప్పటికీ రంపచోడవరం నియోజకవర్గంలో ఏ పనైనా ఆయన కనుసన్నల్లోనే జరుగుతోందట. నియోజకవర్గంలో మొత్తం 11 మండలాలు ఉన్నాయి. రాష్ట్ర విభజనప్పుడు తెలంగాణలోని పోలవరం ముంపు మండలాలు కొన్ని రంపచోడవరం నియోజకవర్గంలో కలిశాయి. రంపచోడవరం వ్యాప్తంగా తనకు నమ్మకంగా ఉన్న అనుచరులతో…