నేడు ఉమ్మడి విశాఖ, తూర్పుగోదావరి జిల్లాల్లో జనసేన అధినేత పవన్‌కల్యాణ్ పర్యటించనున్నారు. ఉమ్మడి విశాఖ జిల్లా సమన్వయకర్తలు, ముఖ్యనేతలతో వేర్వేరుగా భేటీ కానున్నారు. టికెట్ ఆశావహులకు క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. మూడు పార్టీల పొత్తు కారణంగా సీట్ల సర్దుబాటులో ఆశించిన వాళ్ళందరికీ అవకాశం రాకపోవచ్చనే విషయం చెప్పే ఛాన్స్ ఉంది.
రాజమండ్రి గోరక్షణ పేట ప్రధాన రహదారిలో భూమి కుంగిపోయింది. రోడ్డు మధ్య బీటలు వారి అమాంతంగా గొయ్యి పడింది. ఒక్కసారిగా భూమి కుంగిపోవటంతో స్థానికులు భయాందోళనలు గురయ్యారు.
రాజమండ్రి వైసీపీ ఎంపీ మార్గాని భరత్ సెల్‌ఫోన్ చోరీకి గురైంది. రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా పర్యటనలో ఎంపీ మార్గాని భరత్ పాల్గొనగా.. ఆయన ఫోన్‌ను దుండగులు కొట్టేసినట్లు తెలుస్తోంది. తన ఫోన్ చోరీకి గురైందన్న విషయంపై ఎంపీ భరత్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. చివరగా రాజమండ్రి ఎయిర్‌పోర్టులోని హెర్బల్ షాపులో పని చేసే యువతితో ఆయన తన ఫోన్‌తో సెల్ఫీ తీసుకున్నారు. అనంతరం ఫోన్ కనిపించలేదని ఎంపీ భరత్ వివరించారు. ఎంపీ వ్యక్తిగత…
రాజమండ్రిలోని ప్రకాష్‌నగర్‌లో ఉన్న సారథి ఆస్పత్రిలో పూజలు చేయడం స్థానికంగా కలకలం సృష్టించింది. ఆసుపత్రి యజమాని పార్థసారధి ఆధ్వర్యంలో ఆస్పత్రి ఆవరణలో ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. దీంతో డాక్టర్ సారధి భార్య చంద్రకళ భయాందోళనకు గురై పోలీసులను ఆశ్రయించారు. ఆస్పత్రి ఆవరణలో చేపట్టిన దశ మహా విద్య, ధూమావతి, ప్రత్యంగిర చినమస్త అనేవి తాంత్రిక పూజలు అని ఆమె ఆరోపించారు. అయితే ఈ పూజలపై ఆస్పత్రి యజమాని పార్థసారధిని వివరణ అడగ్గా.. ఇది సాధారణ పూజలేనని..…
పుర్రెకో బుద్ధి.. జిహ్వకో రుచి అంటారు. గతంలో అల్లుడికి భారీస్థాయిలో సారె పంపిన కథ విన్నాం, చూశాం. అదే అల్లుడి అత్తగారికి కూడా తమ తరఫున ఆషాడం సారె పంపారు. వందల కిలోల స్వీట్లు, హాట్లు… అరటిపళ్ళు….ఇలా ఎందులోనూ తగ్గేది లేదని రెండు కుటుంబాల వారు తమ విలక్షణత చాటుకున్నారు. ఓ ఎమ్మెల్యే తులాభారం గోదావరి జిల్లాల్లో హాట్ టాపిక్ అవుతోంది. తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ చిర్ల జగ్గిరెడ్డి బూర్లతో తులాభారం తూగారు.…
రూపాయికి ఏం వస్తుంది. ఒక అగ్గిపెట్టె.. ఒక చాక్లెట్.. అంతకుమించి ఏమీ రావు. కానీ ఏపీలో అక్కడికెళితే ఒక్కరూపాయికి మీ ఆకలి తీరుతుంది. అక్కడ వేడి వేడి ఇడ్లీని కస్టమర్లకు అందిస్తున్న ఈయన పేరు చిన్ని రామకృష్ణ. అందరూ రాంబాబుగా పిలుచుకునే ఈయన తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం సమీపంలోని ఆర్బీ కొత్తూరు గ్రామంలో ఓ చిరు హోటల్ యాజమాని. గత 16 సంవత్సరాలుగా రాంబాబు ఆర్బీ కొత్తూరు గ్రామంలో ఈ జనతా హోటల్ నడుపుతున్నాడు. ఐతే ఈ…
మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ నటించిన ఆర్.ఆర్.ఆర్ మూవీ ఈనెల 25న విడుదల కానుంది. ఆర్.ఆర్.ఆర్ తర్వాత డైరెక్టర్ శంకర్‌తో రామ్‌చరణ్ ఓ సినిమాను చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ రాజమండ్రి పరిసరాల్లో జరుగుతోంది. చిత్రీకరణ కోసం రాజమండ్రి వెళ్లిన రామ్ చరణ్ అభిమానులతో ఫొటో షూట్‌లో పాల్గొన్నాడు. రామ్‌చరణ్ రాజమండ్రి వచ్చిన సందర్భంగా అతడికి సురుచి సంస్థ మధురమైన కానుక అందించింది. తాపేశ్వరంలో తయారుచేసిన ఈ బాహుబలి కాజాను చెర్రీకి బహూకరించింది. కాగా రాజమండ్రి వచ్చే…