Cold Wave: చలి వణికిస్తోంది.. పొగ మంచు కమ్ముకుంటోంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Cold Wave in Telangana: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చలి తీవ్రత క్రమంగా పెరిగింది. ఇక.. అక్టోబర్ నెలలో చూస్తే పదేళ్లలో ఎప్పుడు లేని విధంగా కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు కాగా, ఈ నెలలోనూ ఉష్ణోగ్రతలు క్రమంగా పడిపోతున్న నేపథ్యంలో.. ఉదయం పొగ మంచు కురుస్తుంది. ఇక వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అక్టోబర్ తోవర్షాకాలం ముగియడంతో రాష్ట్రంలో క్రమంగా చలి పెరుగుతోంది. అయితే.. అక్టోబర్ చివరి వారంలోనే చలి తీవ్రత పెరిగటం మొదలైంది. తాజాగా.. ప్రస్తుతం ఉష్ణోగ్రతలు అంతకంతకూ పడిపోతున్న సాయంత్రం 5 దాటితే చాలు చలి వణికిస్తోంది. ఇక, ఉదయం పూట చాలా చోట్ల పొగ మంచు కమ్ముకుంటోంది. హైదరాబాద్ నగరంలోనూ చలి ఎక్కువగానే ఉంది. ఉదయం పొగ మంచు కురుస్తుండటంతో.. వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భాగ్యనగరంలో చాలా చోట్ల 15 డిగ్రీల సెల్సియస్, అంతకంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. ఈ సమయంలో ప్రయాణాలు మంచివి కావని, రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు.
Read also:Four tigers in Adilabad: ఆదిలాబాద్ జిల్లాలో రోడ్డుపై నాలుగు పులులు.. పరుగులెత్తిన జనం
Also Read
- CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
- El Nino : తెలంగాణలో కరువు ముప్పు.. రెండో పంట వేయొద్దంటూ మంత్రి కీలక విజ్ఞప్తి
- Indigo : పవర్ బ్యాంక్‌లో మంటలు.. శంషాబాద్‌లో ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
- Brilliance AI : విద్యార్థుల చదువుకు ఏఐ సాయం.. హైదరాబాద్‌లో కొత్త సాఫ్ట్‌వేర్
తెలంగాణ ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో చలి తీవ్రత పెరిగింది. కనిష్ట ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. ఎజెన్సీ చలికి వణికిపోతున్నారు. కొమురం భీంజిల్లాలో 11.1గా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆదిలాబాద్ జిల్లాలో 12.2, మంచిర్యాల 13.3, నిర్మల్ 14గా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉమ్మడి మెదక్ జిల్లాలో కనిష్ట ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. చలి తీవ్రత పెరుగుతుంది. సిద్దిపేట జిల్లా అంగడి కిష్టపూర్ లో 13.4 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదకాగా.. సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ లో 13.7 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది.
ఇక ఏపీ లోని తిరుమలలో వర్షంతోపాటు చలితీవ్రత పెరిగి భక్తులు ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. భక్తులు టీటీడీ పీఏసీలు, షెడ్లలో వేచి ఉన్న భక్తులకు తీవ్ర ఇబ్బందిపడుతున్నారు. దట్టమైన పొగమంచు చిరు జల్లుల మధ్యభక్తులు వణికిపోతున్నారు. మూడు రోజులుగా చిరు జల్లులతో కూడిన వర్షం పడుతూనే వుంది దీంతో పలు ప్రాంతాల్లోనూ చలి విజృంభిస్తోంది. ఇక విశాఖ మన్యం ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

తాజావార్తలు
-
Shreyas Iyer: ఓడిపోతామనుకున్నా.. అక్కడే మ్యాచ్ మలుపు తిరిగింది..
-
Shai Hope: అదే మా కొంప ముంచింది.. చాలా బాధగా ఉంది.. వెస్టిండీస్ కెప్టెన్ ఆవేదన..
-
Ind vs WI : అభిషేక్ శర్మ మెరుపు అర్ధశతకం.. వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.!
-
CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!