Four tigers in Adilabad: ఆదిలాబాద్ జిల్లాలో రోడ్డుపై నాలుగు పులులు.. పరుగులెత్తిన జనం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Four tigers in Adilabad: పులుల సంచారం తెలంగాణ రాష్ట్రంలో కలకలం రేపుతోంది. పులి సంచారం గ్రామాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది..అడుగుతీసి అడుగు వేయాలంటే జనం జంకుతున్నారు. పంటపొలాల వైపు వెళ్ళాలంటే జడుసుకునే పరిస్థితి ఎదురౌతోంది. ఆదిలాబాద్, మంచిర్యాల జిల్లాల్లో పులి సంచారం కంటిమీదకునుకు లేకుండా చేస్తున్నాయి. ఇక ఆదిలాబాద్‌జిల్లా భీంపూర్ మండలం గొల్లఘాట్ గ్రామం, తాంసి మండలం పిప్పలకోటి గ్రామం మధ్య రోడ్డుపై కాల్వ పనులు కొనసాగుతున్న ఏరియాలో నాలుగు పులులు కనిపించాయి. తన ట్రక్కులో ఇంధనం నింపుతున్నప్పుడు పిప్పల్‌కోటి గ్రామం వద్ద రిజర్వాయర్ సమీపంలో రోడ్డుపై కనిపించిన పులులను డ్రైవర్ వీడియో రికార్డ్ చేశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటన స్థానికుల్లో భయాందోళనకు గురి చేసింది.

Also Read
4 పులులు మహారాష్ట్ర లోని తిప్పేశ్వర్ టైగర్ జోన్ నుంచి వచ్చినట్టుగా అటవీ శాఖ అధికారులు తెలిపారు. వేట కోసం పెన్‌గంగా నదిని దాటి తరచుగా ఆదిలాబాద్‌లోకి ప్రవేశిస్తున్నాయని అటవీ అధికారులు తెలిపారు. జంతువులను పర్యవేక్షించేందుకు యానిమల్ ట్రాకర్లను ఏర్పాటు చేశామని, సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామని వారు తెలిపారు. పులుల కదలికలను ప్రత్యేక టీంలు మానిటరింగ్ చేస్తున్నట్లు వెల్లడించారు. పులులకు హాని చేయవద్దని అన్నారు.
నవంబర్ 8న జైనంత్ మండలం హతీఘాట్ గ్రామం, భీంపూర్ మండలంలోని రాంపూర్ గ్రామం మధ్య ఉన్న చనకా-కొరాట అంతర్ రాష్ట్ర నీటిపారుదల ప్రాజెక్టు కాలువలో పులులు సంచరిస్తూ స్థానికులను భయాందోళనకు గురిచేశాయి. కొరాట, గూడ, రాంపూర్, తాంసి, గొల్లఘాట్‌తో పాటు పలు గ్రామాల వాసులు పులి భయంతో వ్యవసాయ పనులు చేసేందుకు వెళ్లలేక పోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతకుముందు అక్టోబర్ 12న ఆదిలాబాద్ జిల్లా గాదిగూడ మండలం కొలమా గ్రామం అడవుల్లో పులి మేకను చంపింది. సెప్టెంబర్ 23న భీంపూర్ మండలం ధనోరా గ్రామంలో వ్యవసాయ పొలాల్లో కూడా పులి కనిపించింది. తాంసి, భీంపూర్ మండలాల్లోని అడవుల్లో పెద్దపులి కనిపించింది. కొన్ని వారాల పాటు TWS నుండి పులి యొక్క కదలికను గుర్తుపెట్టారు అధికారులు.
Iran: హిజాబ్ వ్యతిరేక అల్లర్లలో పాల్గొన్నందుకు తొలి మరణశిక్ష విధించిన ఇరాన్
తాజావార్తలు
-
Pakistan: పాకిస్థాన్‌ను 15 ‘ముక్కలు’ చేసేందుకు ఆర్మీ కుట్ర?.. దేశవ్యాప్తంగా వెల్లువెత్తుతున్న నిరసనలు!
-
MS Dhoni: రెండో టీ20 మ్యాచ్‌కు ఎంఎస్ ధోనీ.. ఆ స్టార్ ఓపెనర్ కోసమేనా?.. వైభవ్ కోసం కాదండోయ్!
-
Air India Fuel Surcharge Hike: విమాన ప్రయాణికులకు షాక్.. పెరగనున్న టికెట్ భారం..? కారణం ఇదే..
-
GV Prakash : బాలీవుడ్లో జీవీ ప్రకాష్‌కు టెస్టింగ్ టైం.. నయూ నవేలికి కంప్లీట్ మ్యూజిక్ ఇచ్చిన కంపోజర్
-
Electric Tractors: రైతులకు గుడ్‌న్యూస్.. డీజిల్ ట్రాక్టర్లతో పోలిస్తే ఈ-ట్రాక్టర్లతో 84% ఖర్చు ఆదా..!
ట్రెండింగ్
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!