గత నెలలో గోదావరి ముంపు దెబ్బ నుంచి ఇంకా సరిగా తేరుకోలేదు.. అప్పుడే మళ్లీ గోదారమ్మ విరుచుకుపడుతుంది.. ఆగస్టులో వర్షాలు, వరదలు ఉంటాయని జులైలో ముహూర్తాలు పెట్టుకున్నా.. కొన్ని పెళ్లిళ్లలకు ఇబ్బందులు తప్పలేదు.. ట్రాక్టర్లపై.. చివరకు పడవలపై మరో ప్రాంతానికి వెళ్లి పెళ్లిళ్లు జరిపించిన ఘటనలు వెలుగు చూశాయి.. ఇప్పుడు.. గోదారమ్మ ముంపే కాదు.. ముహూర్తాలు కూడా ముంచుకొస్తున్నాయి.. పెళ్లిళ్ల సీజన్ కావడంతో.. ఆ తంతు జరిపించడం లంక గ్రామాల వాసులకు సవాల్‌గా మారింది.. ఇళ్లు, గ్రామాలను కూడా వదిలేయాల్సిన పరిస్థితి వస్తుండడంతో.. అసలు పెళ్లిళ్లు జరిపేదెలా అని ఆందోళన చెందుతున్నారు.. గ్రామాల్లోకి బంధువులు వచ్చే అవకాశం లేకపోవడంతో.. లొకేషన్లు మార్చేస్తున్నారు.. ఉన్నంతలో లాగించేస్తున్నారు.
Read Also: Breaking: వైఎస్ విజయమ్మకు తప్పిన ప్రమాదం
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలతో పాటు.. మరికొన్ని ప్రాంతాల్లో గోదావరి వరద ఉధృతి పెళ్లిళ్లపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది.. ముహూర్తాల సీజన్ కావడంతో లంక గ్రామాల్లో పెళ్లిళ్లకు కష్టాలు మొదలయ్యాయి.. వరద ప్రవాహం మరింత పెరిగితే పెళ్లి చేసే అవకాశం ఉందడదని ముందే అప్రమత్తం అవుతున్నారు పెళ్లి పెద్దలు.. గ్రామాల్లోకి బంధువులు వచ్చే అవకాశం లేకపోవడంతో పెళ్లిళ్ల లొకేషన్ మార్చేస్తున్నారు.. ట్రాక్టర్లపై, పడవలపై వధువు, వరులను తీసుకెళ్తున్నారు కుటుంబ సభ్యులు.. ఇక, ఎక్కడ కుదిరితే అక్కడ తతంగం ముగించేలా ఏర్పాట్లు చేస్తున్నారు.. ముహుర్తాలు దాటిపోతే ఇబ్బంది అని హడావుడిగా ఏర్పాట్లు చేసి.. పెళ్లిళ్లు చేస్తున్నారు. తాజాగా, రోడ్డుపైనే పెళ్లి కూతురు ముస్తాబు చేస్తున్న వీడియో ఒకటి ఎన్టీవీకి చిక్కింది.. అప్పుడే ట్రాక్టర్ దిగిన పెళ్లి కూతురు, బంధువులు.. రోడ్డుపైనే పెళ్లికూతురుకు తుది మెరుగులు దిద్దుతూ కనిపించారు..