Godavari Floods: గోదావరి ఉప్పొంగడం తో వరద కష్టాలు అన్ని ఇన్ని కాదు.. చనిపోయిన మృత దేహాన్ని తరలించడం కూడా కష్టతరంగా మారింది. దీంతో రెండు రోజులుగా మృతదేహం భద్రాచలంలోని ఉండి పోయిన పరిస్థితి.
వరద గోదారమ్మ పోటెత్తడంతో అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం బడుగువానిలంక గ్రామానికి ముప్పు పొంచి ఉంది. ఆదివారం సాయంత్రానికి ఆ గ్రామం చుట్టూ వరద నీరు చేరింది. అనేక పల్లపు ప్రాంతాల్లో వందలాది ఎకరాల పంటలు ముంపుకు గురయ్యాయి. అయితే ఈ వరద నీరు మరింత పెరిగితే ఆ గ్రామానికి రాకపోకలు నిలిచిపోతాయి. ఎగువ
ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాల వల్ల గోదావరి వరద ఉధృతి మరింత పెరుగుతుందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాధ్ తెలిపారు. సెంట్రల్ వాటర్ కమిషన్ అంచనాల ప్రకారం మరో మూడు రోజులు వరద ప్రవాహం కొనసాగి ఆతర్వాత క్రమంగా తగ్గే అవకాశం ఉందన్నారు.
గోదావరి నది ఉగ్రరూపం దాల్చింది. శబరి నది గోదావరిలో సంగమించే ప్రదేశమైన కూనవరం వద్ద గోదావరి వేగంగా పెరుగుతోంది. కూనవరం వద్ద గోదావరి ప్రస్తుతం 51 అడుగుల నీటిమట్టంతో ప్రవహిస్తోంది.చింతూరు వద్ద 40 అడుగులకు శబరి నది పెరిగింది. కూనవరం సంగమం వద్ద శబరి - గోదావరి నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం వద్ద గోదావరి మరోసారి ఉగ్రరూపం దాల్చింది. గత వారం రోజుల నుంచి ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు ప్రాణహిత నదికి భారీగా వరద పోటెత్తడంతో గోదావరికి భారీ ప్రవాహం వచ్చి చేరుతోంది. తీరం వద్ద 12.100 మీటర్ల ఎత్తులో పుష్కర ఘాట్ మెట్లను వరద ముంచెత్తింది.
గోదావరి ఉగ్రరూపంతో ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద రెండో ప్రమాద హెచ్చరికను మించి ప్రవహిస్తోంది. బ్యారేజ్ వద్ద వరద నీటిమట్టం 13.75 అడుగుల వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. బ్యారేజ్ నుండి 13 లక్షల 261 క్యూసెక్కుల మిగులు జలాలు సముద్రంలోకి విడుదల చేస్తున్నారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చింది. ఈ క్రమంలో.. మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది. దీంతో.. అధికారులు అప్రమత్తమయ్యారు. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు ప్రాణహిత నదికి భారీగా వరద పోటెత్తింది. తీరం వద్ద 12.300 మీటర్ల ఎత్తులో పుష్కర ఘాట్ మెట్లను వరద ముంచెత్తింది. జాగ్రత్�