ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తల్లి వైఎస్ విజయమ్మకు పెను ప్రమాదం తప్పింది… అనంతపురంలో జరిగిన ఓ పెళ్లికి హాజరై ఆమె.. ఆ తర్వాత కర్నూలులో వైఎస్సార్ మిత్రుణ్ణి పరామర్శించేందుకు వెళ్లారు.. అక్కడి నుంచి తిరుగు ప్రయాణం అయిన తర్వాత గుత్తి పెట్రోల్ బంక్ సమీపంలో ఆమె ప్రయాణిస్తున్న కారు రెండు టైర్లు ఒక్కసారిగా పేలిపోయాయి.. రెండు టైర్లు పేలి.. కారు అదుపుతప్పినా.. డ్రైవర్ చాకచక్యంతో ఈ ప్రమాదం తప్పినట్టుగా తెలుస్తుంది.. ఆ తర్వాత మరో కారులో కర్నూలు గెస్ట్ హౌస్ కు చేరుకున్నారు విజయమ్మ.. ఆమెకు ఎలాంటి గాయాలు కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నాయి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, వైఎస్సార్ అభిమానులు.