గత నెలలో గోదావరి ముంపు దెబ్బ నుంచి ఇంకా సరిగా తేరుకోలేదు.. అప్పుడే మళ్లీ గోదారమ్మ విరుచుకుపడుతుంది.. ఆగస్టులో వర్షాలు, వరదలు ఉంటాయని జులైలో ముహూర్తాలు పెట్టుకున్నా.. కొన్ని పెళ్లిళ్లలకు ఇబ్బందులు తప్పలేదు.. ట్రాక్టర్లపై.. చివరకు పడవలపై మరో ప్రాంతానికి వెళ్లి పెళ్లిళ్లు జరిపించిన ఘటనలు వెలుగు చూశాయి.. ఇప్పుడు.. గోదారమ్మ ముంపే కాదు.. ముహూర్తాలు కూడా ముంచుకొస్తున్నాయి.. పెళ్లిళ్ల సీజన్ కావడంతో.. ఆ తంతు జరిపించడం లంక గ్రామాల వాసులకు సవాల్‌గా మారింది.. ఇళ్లు, గ్రామాలను…