నవరత్నాలే హామీలుగా అధికారంలోకి వచ్చిన జగన్.. ఆర్థిక కష్టాలు ఉన్నా.. తుచ తప్పకుండా స్కీముల అమలు చేస్తున్నారు. సంక్షేమాన్ని కొత్త పుంతలు తొక్కిస్తున్నారు. అభివృద్ధి సంగతేంటనే విమర్శలు వచ్చినా.. బిల్డింగులు కాదు.. మానవాభివృద్ధే అసలు అభివృద్ధి అనే నినాదం ఎత్తుకున్నారు జగన్. ఏపీ లోటు బడ్జెట్ కు, జగన్ ఇచ్చిన హామీలకు పొంతన లేదన్న అభిప్రాయాల మధ్య జగన్ పాలన మొదలైంది. గత ప్రభుత్వాలకు భిన్నంగా.. అధికారంలోకి వచ్చిన మూడేళ్లలోనే మొత్తం మ్యానిఫెస్టోనూ అమలు చేశామని, చెప్పనివి…
గుంటూరు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ సమీపంలో జరుగుతున్న వైసీపీ ప్లీనరీలో మాజీ మంత్రి కొడాలి నాని టీడీపీ అధినేత చంద్రబాబుపై తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. రానున్న అసెంబ్లీ ఎన్నికలే చంద్రబాబుకు చివరివి అని జోస్యం చెప్పారు. ఆ ఎన్నికల తర్వాత చంద్రబాబుకు రాజకీయ సమాధి తప్పదని కొడాలి నాని చెప్పారు. చంద్రబాబు మతిస్థిమితం తప్పి మాట్లాడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత 95 శాతం హామీలను అమలు చేసిన వ్యక్తిగా సీఎం జగన్ చరిత్రలో…
వైసీపీ ప్లీనరీలో టీడీపీ అధినేత చంద్రబాబు వేలి ఉంగరంలో చిప్ ఉండటంపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజల కష్టాలను అర్థం చేసుకుని, వారి బాగోగుల గురించి ఆలోచించే చిప్ మెదడు, గుండెలో ఉండాలి కానీ.. చంద్రబాబు చేతి రింగులోనో, మోకాలిలోనో, అరికాలిలోనో ఉంటే లాభం ఉండదని జగన్ వ్యాఖ్యానించారు. గుండె, మెదడులోనూ చిప్ ఉంటే.. అప్పుడే ప్రజలకు మంచి చేసే ఆలోచనలు వస్తాయన్నారు. ప్రజలకు మంచి చేయాలనే ఆలోచన చంద్రబాబుకు ఎప్పుడూ లేదని జగన్…
కాంగ్రెస్ పార్టీపై వైసీపీ ప్లీనరీలో సీఎం జగన్ తీవ్ర విమర్శలు చేశారు. ఓదార్పు యాత్ర చేయవద్దన్న పార్టీని తాను వ్యతిరేకించినందుకు తనపై అక్రమ కేసులు పెట్టారని జగన్ ఆరోపించారు. టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు దేశంలోని శక్తివంతమైన వ్యవస్థలను తనపై ఉసిగొల్పాయని.. అన్యాయమైన ఆరోపణలు చేయించి కేసులు పెట్టించి అరెస్ట్ చేయించారన్నారు. ఆనాడు వాళ్లకు లొంగిపోయి ఉంటే ఈనాడు జగన్ మీ ముందు ఇలా ఉండేవాడు కాదని వ్యాఖ్యానించారు. తనను టార్గెట్ చేసిన పార్టీ ఈరోజు నామరూపాల్లేకుండా పోయిందని…
ఆంధ్రప్రదేశ్‌లో పండుగ వాతావరణంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ సమావేశాలు సాగుతున్నాయి.. తొలిరోజు అత్యంత ఉత్సాహవంతమైన వాతావరణంలో.. ఫుల్ జోష్‌లో ఈ సమావేశాలు సాగాయి.. గుంటూరు జిల్లా నాగార్జున యూనివర్సిటీ దగ్గర జరుగుతోన్న ప్లీనరీ సమావేశాలు తొలిరోజు విజయవంతం కాగా.. రేపు రెండో రోజుతో ప్లీనరీ సమావేశాలు ముగియనున్నాయి.. తొలిరోజు నాలుగు తీర్మానాలు పెట్టి ఆమోదింపజేశారు.. ఇక, పార్టీ చీఫ్, సీఎం వైఎస్ జగన్, విజయమ్మ, మంత్రుల ఉపన్యాసాలు ఆకట్టుకోగా.. రెండోరోజు నిర్వహించనున్న కార్యక్రమానికి సంబంధించిన షెడ్యూల్‌ను…
బిడ్డా ఈ రాష్ట్రం వైసీపీ, జగనన్న అడ్డా.. ఎవ్వరి ఆటలు సాగవు అని హెచ్చరించారు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్.. గుంటూరులో జరుగుతోన్న వైసీపీ ప్లీనరీలో మాట్లాడిన ఆయన.. టీడీపీ, చంద్రబాబు, లోకేష్, పవన్ కల్యాణ్‌పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం నేతలు నొటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డ ఆయన.. రోషం గురించి చంద్రబాబు మాట్లాడుతున్నారంటూ ఎద్దేవా చేశారు. బాబు ఆయన దత్తపుత్రుడి ఆటలు సాగవని హెచ్చరించిన ఆయన.. బిడ్డా ఈ రాష్ట్రం వైసీపీ అడ్డా.. తాము…