సర్వదర్శన భక్తులకు టీటీడీ అధిక ప్రాధాన్యత ఇచ్చింది. నిన్న శ్రీవారిని 88,748 మంది భక్తులు దర్శించుకున్నారు. కోవిడ్ తరువాత నిన్న రికార్డ్ స్థాయిలో శ్రీవారిని భక్తులు దర్శించుకున్నారు. సర్వదర్శన క్యూ లైను ద్వారా స్వామివారిని దర్శించుకున్న 46,400 మంది భక్తులు దర్శిచుకున్నారు. దీంతో పాటు 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన క్యూ లైను ద్వారా 25,819 మంది భక్తులు దర్శించుకోగా, వర్చువల్ సేవా టిక్కేట్లు, సేవా టికెట్లు, టూరిజం శాఖ కేటాయింపులు ద్వారా 16,529 మంది భక్తులుకు స్వామి వారి దర్శన భాగ్యం కలిగింది. అయితే నేటి నుంచి మూడు రోజులు పాటు శ్రీవారి వార్షిక వసంతోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఈ రోజు శ్రీదేవి భూదేవి సమేతుడైన మలయప్పస్వామివారికి స్నపన తిరుమంజనం నిర్వహించనున్నారు. నేటి నుంచి మూడు రోజులు పాటు ఆర్జిత సేవలు రద్దు చేస్తున్నట్లు టీటీడీ వెల్లడించింది.
Telangana Jobs : తెలంగాణలో నిరుద్యోగులకు మరో గుడ్ న్యూస్