Hyderabad Rain: హైదరాబాద్ నగరంలో మళ్ళీ వర్షం మొదలైంది. గత పది రోజులుగా సాయంత్రం నుండి అర్ధరాత్రి వరకు వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. అయితే ఈ రోజు (సెప్టెంబర్ 23) ఉదయం నుంచే వర్షం మొదలయ్యింది. నగరంలో అక్కడక్కడా మోస్తరు వర్షం, మరికొన్ని చోట్ల ముసురు వాతావరణం నెలకొంది. ఇకపోతే వాతావరణ శాఖ హెచ్చరికల ప్రకారం, నేటి నుంచి రాబోయే మూడు రోజుల పాటు నగరంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొత్త ‘Nothing Ear…
Rain Alert : గత కొన్ని రోజులుగా దేశ వ్యాప్తంగా వర్షాలు విస్తారంగా కురుస్తుండగా, ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ వర్షపాతం పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. నిన్నటి నుంచే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇది బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనంతో పాటు బంగ్లాదేశ్, పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాల్లో ఏర్పడనున్న అల్పపీడనం ప్రభావమని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ పరిణామాలతో రాబోయే మూడు రోజులు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు…
రైతులకు చల్లని కబురు.. నైరుతి రుతుపవనాలు ఆంధ్రప్రదేశ్‌ను ముందుగానే పలకరించబోతున్నాయి.. కేరళ తీరాన్ని ముందుగానే తాకనున్నాయి నైరుతి రుతుపవనాలు.. ఐదు రోజులు ముందుగానే నైరుతి రుతుపవనాలు వస్తాయని ఇప్పటికే ఐఎండీ అంచనా వేసింది.
ఆంధ్రప్రదేశ్‌కు భారీ వర్ష సూచన ఉందని చెబుతోంది వాతావరణ శాఖ.. దక్షిణ కోస్తా, ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని.. ముఖ్యంగా ప్రకాశం, అల్లూరి సీతారామరాజు, మన్యం, ఏలూరు జిల్లాల్లో పలు చోట్ల భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది.. ఇక, రెండు రోజుల్లో మధ్య బంగాళాఖాతంలో నైరుతి రుతుపవనాలు ప్రవేశించబోతున్నాయి.. మరోవైపు, రాష్ట్రంపై ఉపరితల ఆవర్తనాల ప్రభావం కొనసాగుతోంది..
ఆంధ్రప్రదేశ్‌ను వర్షాలు వీడడం లేదనే చెప్పాలి.. వరుసగా బంగాళాఖాతంలో అల్పపీడనాలు.. వాటి ప్రభావంతో.. పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తూనే ఉన్నాయి.. మొన్నటి వరకు పలు ప్రాంతాల్లో వర్షాలు కురవగా.. మరో నాలుగు రోజుల పాటు ఏపీలో వర్షాలు కురుస్తాయని జాతీయ వాతావరణ కేంద్రం అంచనా వేసింది.. నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడుతోంది. దీని ప్రభావంతో రాగల రెండు రోజుల్లో తమిళనాడు తీరానికి చేరుకుంటుందని ఐఎండీ అంచనా వేసింది.
ఆంధ్రప్రదేశ్ రైతులకు వాయుగుండం ముప్పు ముంచుకు వస్తోంది. కోత దశలో భారీ వర్షాల వల్ల పంటలు దెబ్బతినే ప్రమాదం ఉన్నందున అప్రమత్తంగా వుండమని హెచ్చరికలు జారీ అయ్యాయి. ప్రస్తుతం దక్షిణ బంగాళా ఖాతంలో వున్న వాయుగుండం తమిళనాడు - శ్రీలంక దిశగా కదులుతూ బలపడుతోంది. "దాన" తీవ్ర తుఫాన్ తర్వాత మరోసారి తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష హెచ్చరికలు జారీ అయ్యాయి. దక్షిణ బంగాళాఖాతంలో వాయుగుండం తీవ్ర రూపం దాల్చింది. వాయువ్య దిశగా గంటకు 18 కిలోమీటర్ల…
బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడుతోంది. 48 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉంది. విపత్తుల సంస్థ కంట్రోల్ రూమ్ నుంచి ఎప్పటికప్పుడూ స్పెషల్ సీఎస్ సిసోడియా పర్యవేక్షిస్తున్నారు. భారీ నుంచి అతిభారీ వర్షాల నేపథ్యంలో దక్షిణకోస్తా, రాయలసీమ జిల్లాల కలెక్టర్లకు ఆయన సూచనలు చేశారు.
మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా బలపడింది. ఇది ఉత్తర దిశగా కదులుతూ ఒడిశా, పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ తీరాల్లో సోమవారం నాటికి వాయుగుండంగా మారనుంది. ఆ తర్వాత మూడు రోజుల్లో పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ ఉత్తర ఒడిశా, ఝార్ఖండ్, ఉత్తర ఛత్తీస్ గఢ్ మీదుగా ప్రయాణించే అవకాశముంది. దీని ప్రభావంతో ఉత్తర కోస్తాలో భారీ వర్షాలు, ఆది, సోమవారాల్లో కోస్తా జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు…
ఆంధ్రప్రదేశ్‌కు మరోసారి వానగండం పొంచి ఉంది. ఇప్పటికే భారీ వర్షాలతో ఏపీ అతలాకుతలం అవుతోంది. విజయవాడ పూర్తిగా నీటిలో మునిగిపోయింది. ప్రజలు ఇంకా తేరికోకముందే.. వాతావరణ శాఖ మరో బాంబు పేల్చింది. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని హెచ్చరించింది. దీని ప్రభావంతో విస్తారంగా వర్షాలు కురుస్తాయని స్పష్టం చేసింది.
హైదరాబాద్ వాసులకు వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. వచ్చే రెండు గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షం కురుస్తుందని వార్నింగ్ ఇచ్చింది. నగర వాసులెవరూ ఇళ్లల్లోంచి బయటకు రావొద్దని హెచ్చరించింది. అలాగే అధికారులను కూడా అప్రమత్తం చేసింది.