విశాఖ స్టిల్ ప్లాంట్ ప్రైవేటీకరణను నిరసిస్తూ సీపీఐ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో ప్రజాసంఘాలు, ట్రేడ్ యూనియన్స్ పాల్గొన్నాయి. స్టిల్ ప్లాంట్ ను కాపాడుకొనేందుకు జులై నెలాఖరున భారీగా ఉద్యమాలు, నిరసన కార్యక్రమాలు చెప్పట్టాలని తీర్మానం చేసారు.
ఇక ఈ సందర్భంగా సీపీఐ రామకృష్ణ మాట్లాడుతూ… 150 రోజులుగా స్టీల్ ప్లాంట్ కోసం ఉద్యమాలు చేస్తున్న కేంద్రం స్పందించటం లేదు. సోము వీర్రాజు ప్రైవేట్ పరం చెయ్యటం లేదంటూ ఇంకా ప్రజలని మభ్యపెడుతున్నారు. పోర్ట్ ఇవ్వలేదు, ఉక్కు ఫ్యాక్టరీ ఇవ్వలేదు, ప్రత్యేక హోదా ఇవ్వలేదు కేంద్రం. ఇకపై ముఖ్యమంత్రి కూడా నిరసనల్లో ప్రత్యక్షంగా పాల్గొనాలి అని పేర్కొన్నారు.