స్టీల్ ప్లాంట్ సంక్షోభం రాజకీయ వేడిని రాజేస్తోంది. విశాఖ ఉక్కు మూసివేయడమే అంతిమ నిర్ణయం అయితే తన పదవికి రాజీనామా చేస్తానని గాజువాక ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ ప్రకటించారు.
వైసీపీ విశాఖ ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ సంచలన వ్యాఖ్యలు చేసారు. స్టీల్ ఫ్లాంట్ ప్రభుత్వ రంగంలోనే కొనసాగుతుందని ప్రధాని చెప్తే.. తాను, అమర్‌నాథ్ పోటీ నుంచి తప్పుకుంటామని అన్నారు. గతంలో విశాఖ స్టీల్ ప్లాంట్‌పై పార్లమెంట్‌లో పోరాటం చేశానన్నారు.
ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చాక ఒక్క ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసి పూర్తి చేసిన దాఖలాలు ఏవైనా ఉన్నాయా అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మంగళగిరిలో ఒక్కరోజు నిరాహారదీక్ష చేపట్టిన ఆయన.. వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఏపీలో వైసీపీ నేతలు చేసిన పాపాలకు ప్రాజెక్టులే కొట్టుకుపోతున్నాయని పవన్ కళ్యాణ్ ఎద్దేవా చేశారు. ఇటీవల చిత్తూరు జిల్లాలో వైసీపీ ప్రభుత్వ వైఫల్యం వల్లే అన్నమయ్య ప్రాజెక్టు గేట్లు కొట్టుకుపోయాయన్నారు.…
తన సినిమాల విషయంలో ఏపీ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 2024లో కొత్త ప్రభుత్వాన్ని తీసుకురావడం ప్రజల చేతుల్లోనే ఉందన్నారు. 2014లో ఓట్లు చీల్చకూడదనే తాను పోటీ చేయలేదన్నారు. ఇప్పుడు 2024 ఎన్నికలు వచ్చేంత వరకు భరించక తప్పదన్నారు. తాము అధికారంలోకి వస్తే వైసీపీ తప్పులకు సమాధానం చెప్పిస్తామన్నారు. సిగరెట్లు తాగితే ఆరోగ్యానికి హానికరం అన్నట్టుగా.. ఏపీలో ప్రజల ఆరోగ్యానికి వైసీపీ హానికరమని పవన్ ఆరోపించారు. ఏపీలో తమ…
విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ అంశాన్ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి లేవనెత్తారు. ఇదే అంశంపై ఇటీవల ఆయన విశాఖలో బహిరంగ సభ నిర్వహించగా.. ఈరోజు విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు పోరాటంలో పాల్గొన్న ఉద్యమకారులు, పోలీస్ కాల్పుల్లో అమరులైన వారి పేర్లను ట్విట్టర్ ద్వారా పవన్ కళ్యాణ్ పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఉద్యమం సమయంలో ఏం జరిగిందో ఆనాటి కొన్ని దినపత్రికలు ప్రచురించిన ఆర్టికల్స్‌ను కూడా పవన్ షేర్ చేశారు. విశాఖ ఉక్కు కోసం ఉద్యమించిన…
జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ తమ పోరాటానికి అండగా ఉండాలని, సభలో పాల్గొనవలసిందిగా విశాఖ ఉక్కు పరిరక్షణ సమితి విజ్ఞప్తి చేసింది. దీంతో ఇవాళ పవన్ కల్యాణ్ విశాఖపట్నం రానున్నారు. అక్కడి నుంచి స్టీల్ ప్లాంట్ ప్రాంగణానికి వెళ్ళి పరిరక్షణ సమితి ప్రతినిధులను కలసి వారు నిర్వహించే సభలో పాల్గొంటారు. మధ్యాహ్నం 2 గం.కు సభ ప్రారంభమవుతుంది. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను నిలుపుదల చేయాలని కోరుతూ ఉక్కు పరిరక్షణ సమితి పోరాడుతోంది. విశాఖ స్టీల్ ప్లాంట్ భావోద్వేగాలతో…
విశాఖ స్టిల్ ప్లాంట్ ప్రైవేటీకరణను నిరసిస్తూ సీపీఐ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో ప్రజాసంఘాలు, ట్రేడ్ యూనియన్స్ పాల్గొన్నాయి. స్టిల్ ప్లాంట్ ను కాపాడుకొనేందుకు జులై నెలాఖరున భారీగా ఉద్యమాలు, నిరసన కార్యక్రమాలు చెప్పట్టాలని తీర్మానం చేసారు. ఇక ఈ సందర్భంగా సీపీఐ రామకృష్ణ మాట్లాడుతూ… 150 రోజులుగా స్టీల్ ప్లాంట్ కోసం ఉద్యమాలు చేస్తున్న కేంద్రం స్పందించటం లేదు. సోము వీర్రాజు ప్రైవేట్ పరం చెయ్యటం లేదంటూ ఇంకా ప్రజలని మభ్యపెడుతున్నారు. పోర్ట్…