AP Govt: ఉద్యోగ సంఘాలతో మంత్రి వర్గ ఉప సంఘం సమావేశం ముగిసింది. ఉద్యోగుల సంఘాల నేతల అభిప్రాయాలను మంత్రులు తెలుసుకున్నారు. ఉద్యోగ సంఘాల నేతల అభిప్రాయాలను క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబుకు వివరించనున్నారు. సీఎంతో సమావేశం అనంతరం కూటమి ప్రభుత్వం ఏం చేయనుందో వివరిస్తామని ఉద్యోగ సంఘాల నేతలకు తెలిపారు. మంత్రులతో పాటు ఉండవల్లి సీఎం నివాసం దగ్గరకు ఉద్యోగ సంఘాల నేతలు వెళ్లారు. ముఖ్యమంత్రితో మంత్రుల భేటీ తర్వాత ఉద్యోగులకు డీఏకు సంబంధించి గుడ్ న్యూస్ చెప్పే అవకాశం ఉంది.
Read Also: Credit Card Frauds : రివార్డ్ పాయింట్లంటూ దిమ్మతిరిగే షాక్
ఇక, గత ఐదేళ్లలో ఉపాధ్యాయులు ఎదుర్కొన్న సమస్యలపై చర్చించడం జరిగింది అని ఏపీ ఎన్జీఓ నేతలు పేర్కొన్నారు. ఉద్యోగులకి సంబంధించిన సమస్యలు తేల్చాల్సిందిగా మంత్రి వర్గ ఉపసంఘానికి తెలియ చేశాం.. పెన్షనర్స్ కి అడిషనల్ క్వాంటం ఆఫ్ బెనిఫిట్స్, పదవి విరమణ బెనిఫిట్స్ ఇవ్వవలసిందిగా కోరాం.. పెండింగ్ ఉన్న 4 డీఏలను చెల్లించాలని కోరాం.. PRC కమిటీ చైర్మన్ ను నియమించాలని కోరాం.. హెల్త్ కార్డులను సిస్టమైజ్ చేయమని తెలిపాం.. మరి కొంత మందికి 62 సంవత్సరాల పదవి విరమణ కొనసాగించాలన్నాం.. పెండింగ్ ఉన్న 7 వేల మంది ఔట్ సోర్స్ ఉద్యోగులని రెగ్యులరైజ్ చేయడం.. పోలీసు సిబ్బంది సరెండర్ లీవ్, పెన్షనర్ల సమస్యలు పరిష్కరించాలని కోరాం.. కారుణ్య నియామకాలు పూర్తి చేయాలని కోరామని ఏపీ ఎన్జీఓ పేర్కొన్నారు.