AP Govt: ఉద్యోగ సంఘాలతో మంత్రి వర్గ ఉప సంఘం సమావేశం ముగిసింది. ఉద్యోగుల సంఘాల నేతల అభిప్రాయాలను మంత్రులు తెలుసుకున్నారు. ఉద్యోగ సంఘాల నేతల అభిప్రాయాలను క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబుకు వివరించనున్నారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ఉద్యోగుల సమస్యలపై దృష్టి పెట్టింది.. దీపావళికి రెండు రోజుల ముందు గుడ్ న్యూస్ చెప్పాలనుకుందో.. ఏమో.. కానీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. మంత్రులతో.. ఉన్నతాధికారులతో సమావేశం అయ్యారు.. ఆర్ధిక శాఖ ఉన్నతాధికారులతో ఉద్యోగుల డీఏ.. ఇతర అంశాలు చర్చించారు… ఇవాళ ముగ్గురు మంత్రులు.. ఉద్యోగ సంఘాలతో చర్చలు జరపనున్నారు.. ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ సహా మంత్రులు సత్యకుమార్ యాదవ్, నాదెండ్ల మనోహర్ లను ఉద్యోగ సంఘాలతో చర్చించాలని ఆదేశాలు ఇచ్చారు సీఎం…
ఏపీలో ఉద్యోగ సంఘాలు ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేస్తున్నాయి.. మాకు రావాల్సినవి ఇవ్వకపోతే ఉద్యమిస్తాం అంటూ అల్టిమేటం ఇస్తున్నాయి... ఒకటో తేదీనే జీతం ఇస్తున్న ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతూనే, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ఆర్టీసీ ఉద్యోగులు అసంతృప్తి ప్రకటిస్తున్నారు.. ఏపీజేఏసీ నాయకులు.. ఉద్యోగ, ఉపాధ్యాయుల విషయంలో ప్రభుత్వ జగన్నాథ రథచక్రాలు పని చేయడం లేదని, సంవత్సర కాలం ఎదురుచూసాం.. ప్రభుత్వ జగన్నాథ రథచక్రాలు ఉద్యోగుల వైపు చూడాలి అంటూ మనసులో మాటను బయటపెట్టారు..
ప్రభుత్వం పై పోరాటానికి సిద్ధమవుతున్నాయి ఏపీ ఉద్యోగ సంఘాలు. పెండింగ్ డీఏ బకాయిలు, పీఆర్సీతో పాటు పలు ప్రధాన డిమాండ్లను ప్రభుత్వం ముందు పెట్టాయి ఉద్యోగ సంఘాలు. ఇవి నెరవేర్చే వరకు పోరాటానికి ఉద్యోగ సంఘాలు కార్యాచరణ ప్రకటించాయి. వచ్చే నెల నుంచి వివిధ రూపాల్లో నిరసన గళం విప్పనున్నాయి. డిసెంబర్ 1వ తేదీన సీఎస్ కు నోటీసు ఇవ్వాలని ఉద్యోగ సంఘాలు నిర్ణయించాయి. డిసెంబర్ 7 నుంచి 10 వరకు అన్ని జిల్లాల్లో బ్లాక్ బ్యాడ్జీలతో…