అభివృద్ధి, కరెంట్ కోతలు, నీళ్ల సమస్య, రోడ్ల సమస్యలపై తెలంగాణ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.. అయితే, కేటీఆర్ వ్యాఖ్యలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు రాజకీయ నేతలు.. ఏపీ మంత్రులు, వైసీపీ నేతలు.. కేటీఆర్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తుండగా.. కేటీఆర్ చెప్పింది వందకు వంద శాతం కరెక్ట్ అంటున్నారు టీడీపీ నేతలు. ఇక, కేటీఆర్ కామెంట్లపై స్పందించిన బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు.. తెలంగాణ ప్రజలను అధ్వాన్నంగా పరిపాలిస్తున్న ఏపీకి కాకుండా ఉత్తరప్రదేశ్ కు పంపండి కేటీఆర్.. డబుల్ ఇంజన్ ప్రభుత్వం అవినీతిని, అరాచకాలను ఎలా బుల్డోజింగ్ చేస్తుందో ప్రజలు చూస్తారు. ధైర్యం చేస్తారా? అంటూ ప్రశ్నించారు. ఇక, ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని బీజేపీ కోసం తెలంగాణ ఎదురుచూస్తోందని తన ట్వీట్‌లో పేర్కొన్నారు జీవీఎల్ నరసింహారావు.
తెలంగాణ ప్రజలను అధ్వాన్నంగా పరిపాలిస్తున్న ఏపీకి కాకుండా ఉత్తరప్రదేశ్ కు పంపండి @KTRTRS గారు. డబుల్ ఇంజన్ ప్రభుత్వం అవినీతిని,అరాచకాలను ఎలా బుల్డోజింగ్ చేస్తుందో ప్రజలు చూస్తారు. ధైర్యం చేస్తారా? మోడీ గారి నేతృత్వంలోని బీజేపీ కోసం తెలంగాణ ఎదురుచూస్తోంది. https://t.co/hvQZogmxGk
— GVL Narasimha Rao (@GVLNRAO) April 29, 2022