సినిమా టికెట్ల విషయంలో ఏపీ ప్రభుత్వం, సీఎం జగన్, మంత్రులపై జనసేన అధినేత, పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే లేపాన్ని.. మంత్రులు పవన్‌పై ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు.. ఇక, సినీ దర్శక నిర్మాత, రచయిత, నటుడు పోసాని కృష్ణ మురళి చేసిన వ్యాఖ్యలు రచ్చగా మారాయి.. పోసానిని పవన్ అభిమానులు టార్గెట్ చేయడం.. ఆ తర్వాత మళ్లీ పోసాని ప్రెస్‌మీట్ పెట్టి.. మెగా ఫ్యామిలీని, పవన్‌ను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ మాట్లాడడంపై పవన్ ఫ్యాన్స్ భగ్గుమన్నారు. ఆ వ్యవహారం కాస్తా పోలీస్‌స్టేషన్ వరకు వెళ్లింది. అయితే, తాజాగా పోసాని కామెంట్లపై స్పందించిన టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
పోసాని మురళి పెయిడ్ ఆర్టిస్ట్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు అచ్చెన్నాయుడు.. ఆయన మాట్లాడిన బూతులు సభ్య సమాజం తలదించుకునేలా ఉన్నాయన్న టీడీపీ నేత.. పోసాని చేత ప్రశాంత్ కిషోర్ టీమ్ మాట్లాడిస్తుంది అంటూ ఫైర్ అయిన అచ్చెన్నాయుడు.. వారిని సీఎం వైఎస్ జగన్ బహిరంగంగా ఎందుకు వారించడంలేదని ప్రశ్నించారు. అసలు, సామాన్యులు వినలేని భాష పోసాని మురళి మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసిన అచ్చెన్నాయుడు.. తాగుబోతులు కూడా పోసానిలా మాట్లాడరు అంటా మండిపడ్డారు అచ్చెన్నాయుడు.