AP Reorganisation : రేపు పార్లమెంట్లో ఏపీ పునర్విభజన చట్ట సవరణ బిల్లు-2026
- అమరావతికి చట్టబద్ధ గుర్తింపు దిశగా అడుగు
- లోక్‌సభలో రేపు సవరణ బిల్లు ప్రవేశం
- రాజధాని అనిశ్చితికి ముగింపు సంకేతాలు
- పెట్టుబడిదారుల్లో పెరిగే నమ్మకం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో గత కొన్నేళ్లుగా నెలకొన్న సందిగ్ధతకు శాశ్వతంగా తెరదించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. అమరావతిని రాష్ట్ర అధికారిక రాజధానిగా స్థిరపరుస్తూ, దానికి చట్టబద్ధత కల్పించే లక్ష్యంతో ‘ఏపీ పునర్విభజన చట్ట సవరణ బిల్లు 2026’ను రేపు లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నారు. మార్చి 28వ తేదీన ఆంధ్రప్రదేశ్ శాసనసభ చేసిన తీర్మానాన్ని పరిగణనలోకి తీసుకుని, కేంద్రం ఈ వ్యూహాత్మక నిర్ణయం తీసుకుంది.
LIK: ప్రదీప్ రంగనాథన్ ‘LIK’ సెన్సార్ కంప్లిట్..
Also Read
2014 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ప్రకారం, పదేళ్ల పాటు హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలని పేర్కొన్నారు. ఆ గడువు ముగిసిన నేపథ్యంలో, ఆంధ్రప్రదేశ్ తన సొంత రాజధానిని ఏర్పాటు చేసుకునే వీలుంది. అయితే, చట్టంలో ఉన్న సాంకేతిక అంశాలను సవరిస్తూ, ఇకపై ఆంధ్రప్రదేశ్ రాజధాని ‘అమరావతి’ అని స్పష్టంగా పేర్కొంటూ ఈ సవరణ చేయబోతున్నారు. దీనివల్ల అమరావతికి ఒక స్థిరమైన రూపం ఏర్పడటమే కాకుండా, భవిష్యత్తులో రాజధాని మార్పు వంటి రాజకీయ అనిశ్చితులకు తావు లేకుండా పోతుంది.
Leander Paes: బెంగాల్ ఎన్నికల వేళ కీలక పరిణామం.. బీజేపీలో చేరిన లియాండర్ పేస్
రేపు లోక్‌సభలో ఈ బిల్లును ప్రవేశపెట్టిన తర్వాత సుమారు గంట పాటు చర్చ జరగనుంది. అనంతరం లోక్‌సభ ఆమోదం పొందిన వెంటనే, ఈ బిల్లు రాజ్యసభ ముందుకు వెళ్లనుంది. రేపు లేదా ఎల్లుండి (ఏప్రిల్ 2) కల్లా రాజ్యసభలో కూడా చర్చ ముగిసి బిల్లు ఆమోదం పొందే అవకాశం ఉంది. దీంతో అమరావతికి రాజ్యాంగబద్ధమైన గుర్తింపు లభించనుంది. రాజధానిపై స్పష్టత లేకపోవడంతో గత కొన్నేళ్లుగా అమరావతిలో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు వెనుకాడారు. ఇప్పుడు కేంద్రం నేరుగా చట్ట సవరణ చేస్తుండటంతో, అంతర్జాతీయ సంస్థలు , పెట్టుబడిదారుల్లో నమ్మకం కలగనుంది. ఇది రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి , మౌలిక సదుపాయాల కల్పనకు భారీ ఊతాన్నిస్తుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
తాజావార్తలు
-
Global Fuel Crisis: అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్‌లో రికార్డ్ స్థాయికి చేరిన డీజిల్, పెట్రోల్ ధరలు.. నెక్ట్స్ భారత్ వంతేనా?
-
Sangeet First Single: ఏఆర్ రెహమాన్ చేతుల మీదుగా ‘నీ వల్లే’ సాంగ్ రిలీజ్.. సిద్ శ్రీరామ్ మెలోడీకి ఫిదా అవుతున్న ఫ్యాన్స్!
-
Girls Hair Cutting: నిద్రలో ఉండగా జడలు కత్తిరింపు.. భీమిలి కేజీబీవీలో కలకలం
-
BhagyashriBorse : ఫ్లాపుల్లో భాగ్యశ్రీ బోర్సేకు వరుస ఆఫర్స్..సక్సెస్ తర్వాత నో ఛాన్స్
-
Job Loss Benefit: ఉద్యోగం పోయిందా? డోంట్ వర్నీ.. 50% జీతం మీ అకౌంట్లోకి వస్తుంది.. ఈ స్కీమ్ గురించి తెలుసా?
ట్రెండింగ్
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!