ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో, సర్వంగ సుందరంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం అడుగులు వేగవంతం చేసింది. సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన 56వ సీఆర్డీఏ (CRDA) అథారిటీ సమావేశంలో రాజధాని అభివృద్ధికి సంబంధించి ఏడు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపారు. ఈ సమావేశం అనంతరం పురపాలక శాఖ మంత్రి నారాయణ మీడియాకు వివరాలను వెల్లడిస్తూ, రాజధాని నిర్మాణ పనుల కోసం భారీగా నిధులు మంజూరు చేసినట్లు ప్రకటించారు. రాజధానిలో సాంకేతిక విప్లవానికి…
CM Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. సోమవారం సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన 56వ సీఆర్డీఏ (CRDA) అథారిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాజధాని పనుల పురోగతి, కొత్త టెండర్లు, భూ కేటాయింపులపై పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అమరావతిని నాలెడ్జ్ హబ్‌గా మార్చే దిశగా, రాజధానిలో ‘క్వాంటం కంప్యూటింగ్ సెంటర్’ భవనాల నిర్మాణానికి టెండర్లు పిలిచే అంశంపై అథారిటీ…
Former CJI NV Ramana: గత ప్రభుత్వ హయాంలో తన కుటుంబాన్ని టార్గెట్ చేసి క్రిమినల్ కేసులు పెట్టారని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ సంచలన వ్యాఖ్యలు చేశారు. వీఐటీ యూనివర్సిటీ ఐదో స్నాతకోత్సవంలో పాల్గొన్న ఆయన మాట్లాడారు. తన కుటుంబాన్ని టార్గెట్ చేసినా భరించానన్నారు. వ్యవస్థలు కష్టకాలంలోనే పరీక్షకు గురవుతాయన్నారు. గత పాలకుల నిర్ణయాలతో అమరావతి కష్టాలకు గురయ్యిందన్నారు. రైతుల కష్టం, త్యాగంతో అమరావతి నిర్మాణం జరుగుతుందన్నారు. న్యాయవ్యవస్థపై రైతులు నమ్మకం…
CM Chandrababu: రాజధాని అమరావతిలోని సీఆర్డీయే కార్యాలయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. భూములు ఇచ్చిన రైతులతో కలిసి ఈ భవనాన్ని ఆరంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత ఏపీకి రాజధాని లేని పరిస్థితి ఏర్పడింది.
AP Cabinet: రేపు ఉదయం 11 గంటలకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ భేటీలో రాజధాని అమరావతిలో 20, 494 ఎకరాల భూ సమీకరణకు మంత్రి మండలి గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంది.
ప్రభుత్వం వచ్చి సంవత్సరం అయిన హామీలు అమలు చేయడం లేదంటూ గుడ్డిగా మాట్లాడుతున్నారని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. రూ. 3000 పెన్షన్ రూ. 4000 చేశామని తెలిపారు. అన్న క్యాంటీన్లు పెట్టామని.. మహిళలకి మూడు గ్యాస్ సిలిండర్లు ఇచ్చామన్నారు. రానున్న రోజుల్లో ముందే అకౌంట్ లో డబ్బులు వేసేస్తామని స్పష్టం చేశారు.
టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ కార్యవర్గంతో టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. మే 18 నాటికి రాష్ట్ర కమిటీలు మినహా అన్ని కమిటీలు పూర్తి చేయాలని ఆదేశించారు. కడపలో 27, 28, 29 తేదీల్లో మూడు రోజుల పాటు మహానాడు నిర్వహించనున్నారు. మిగిలిన నామినేటెడ్ పదవులు త్వరలోనే భర్తీ చేస్తామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. రాజధాని పనుల పున:ప్రారంభ కార్యక్రమం విజయవంతంలో కార్యకర్తల కృషి అభినందనీయమన్నారు. ప్రభుత్వం ఏ మంచి కార్యక్రమం చేసినా…
ఏపీ రాజధాని అమరావతి పునర్నిర్మాణ పనుల ప్రారంభోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తోంది. పదేళ్ల క్రితం 2015 అక్టోబరు 22న అమరావతి నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ప్రధాని నరేంద్రమోడీ చేతుల మీదుగానే అమరావతి పునర్నిర్మాణం మొదలైంది. ఈ కార్యక్రమంలో మంత్రి నారాలోకేష్ మాట్లాడారు. పహల్గాం దాడిలో అమరులైన టూరిస్టుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. వేదిక మీద నుంచి పాకిస్థానీయులను హెచ్చరించారు.
రాజధాని అమరావతి రీలాంచ్ కార్యక్రమానికి సర్వం సిద్ధమైంది.. నేడు ఏపీ రాజధాని అమరావతి రీలాంచ్ కార్యక్రమానికి ప్రధాని మోడీ హాజరవుతున్నారు. మధ్యాహ్నం మూడున్నరకు అమరావతికి చేరుకోనున్న మోడీ.. ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల అనంతరం బహిరంగసభలో ప్రసంగిస్తారు. మోడీ సభకు 5 లక్షల మంది జనం వస్తారని అంచనా వేస్తున్నారు కూటమి నేతలు..