రాష్ట్ర విభజన చట్టంలోని 13వ షెడ్యూల్లో పేర్కొన్న అంశాల పురోగతిపై రేపు కేంద్ర హోంశాఖ కార్యదర్శి నేతృత్వంలో సమావేశం. ఈ సమావేశానికి ఏపీ నుంచి అధికారులు హాజరుకానున్నారు.
ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం అమలు విషయంలో ఇప్పటికీ అనేక సందేహాలు ఉన్నాయి.. ఆ చట్టంలోని మెజార్టీ అంశాలు అమలుకు నోచుకోలేదని రెండు రాష్ట్రాలు చెబుతూ వస్తున్నాయి.. అయితే, దీనిపై క్లారిటీ ఇచ్చింది కేంద్ర హోంశాఖ.. “ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం” అమలు గురించి టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు లోక్‌సభలో ప్రశ్నించారు.. విభజనచట్టంలో పొందుపరచిన అంశాలు అన్నీ నెరవేర్చారా? లేదా? లేకపోతే అమలుకు ఎటువంటి చర్యలు తీసుకున్నారని అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి…