Ration Cardholders: రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్.. ఈ నెల 31 వరకే అవకాశం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలోని రేషన్ కార్డు లబ్ధిదారులకు పౌర సరఫరాల శాఖ అత్యంత కీలకమైన సమాచారాన్ని అందించింది. రాష్ట్రవ్యాప్తంగా రేషన్ కార్డు కలిగి ఉన్న సభ్యులందరికీ ఉచితంగా ఇ-కెవైసి (e-KYC) ప్రక్రియను పూర్తి చేయడానికి ఈ నెల 31వ తేదీని ఆఖరి గడువుగా నిర్ణయించింది. ఈ గడువు ముగిసిన తర్వాత e-KYC లేని లబ్ధిదారులకు భవిష్యత్తులో రేషన్ పంపిణీ నిలిచిపోయే ప్రమాదం ఉందని అధికారులు స్పష్టం చేశారు.
ప్రభుత్వ నిబంధనల ప్రకారం రేషన్ కార్డులో పేరున్న ప్రతి ఒక్క సభ్యుడు తప్పనిసరిగా తమ బయోమెట్రిక్ లేదా ఐరిస్ వివరాలను నమోదు చేయించుకోవాల్సి ఉంటుంది. దీనికోసం లబ్ధిదారులు తమ రేషన్ కార్డుతో పాటు సభ్యుల ఆధార్ కార్డులను తీసుకువెళ్లి స్థానిక రేషన్ డీలర్ వద్ద లేదా మీ సేవ కేంద్రాలలో ఈ ప్రక్రియను ఉచితంగా పూర్తి చేసుకోవచ్చు. ముఖ్యంగా వృద్ధులు, అనారోగ్యంతో ఉన్నవారు, వేలిముద్రలు పడని వారి కోసం పౌరసరఫరాల శాఖ ఐరిస్ (కంటి గుర్తింపు) సౌకర్యాన్ని కూడా అందుబాటులోకి తెచ్చింది.
Also Read
- కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
- AP Cabinet Meeting: ఏపీ కేబినెట్ ప్రత్యేక భేటీ.. పవన్ కల్యాణ్ సహా జనసేన మంత్రుల డుమ్మా..
- Election Commission: సీజేపీ నిరసనల వేళ కేంద్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం..
- MA Ghaffoor’s Son Kiran Dies in US: అమెరికాలో తెలుగు సైంటిస్ట్ కన్నుమూత.. సీపీఎం మాజీ ఎమ్మెల్యే గఫూర్ ఇంట తీవ్ర విషాదం..
రాష్ట్రంలో అర్హులైన అసలైన పేదలకు మాత్రమే సంక్షేమ పథకాలు అందాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టింది. రేషన్ వ్యవస్థలో పారదర్శకతను పెంచడానికి, నకిలీ, చెల్లుబాటు కాని కార్డులను పూర్తిగా ఏరివేయడానికి పౌరసరఫరాల శాఖ ఈ ప్రక్రియను తప్పనిసరి చేసింది. గతంలో రేషన్ కార్డులు ఉండి, ప్రస్తుతం వేరే ప్రాంతాలకు వలస వెళ్లిన వారు లేదా మరణించిన వారి పేర్లను తొలగించడానికి ఇది ఉపయోగపడుతుంది.
గడువు ముగియడానికి కొద్ది రోజులు మాత్రమే సమయం ఉన్నందున, లబ్ధిదారులు చివరి నిమిషం వరకు వేచి చూడకుండా వెంటనే తమ సమీపంలోని రేషన్ దుకాణానికి వెళ్లి e-KYC పూర్తి చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఒకవేళ నిర్ణీత గడువులోగా ఈ ప్రక్రియను పూర్తి చేయకపోతే, సదరు సభ్యుల పేర్లు రేషన్ కార్డు నుండి తొలగించబడే అవకాశం ఉంది. దీనివల్ల భవిష్యత్తులో కేవలం రేషన్ బియ్యం మాత్రమే కాకుండా, ప్రభుత్వం రేషన్ కార్డుల ఆధారంగా అందించే ఇతర సంక్షేమ పథకాలకు కూడా దూరం కావాల్సి వస్తుందని పౌర సరఫరాల శాఖ హెచ్చరించింది.
తాజావార్తలు
-
Ranabaali Trailer: ‘రణబాలి’ ట్రైలర్పై మంత్రి లోకేష్ రివ్యూ!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
AP Cabinet Meeting: ఏపీ కేబినెట్ ప్రత్యేక భేటీ.. పవన్ కల్యాణ్ సహా జనసేన మంత్రుల డుమ్మా..
-
IPL 2027-CSK: సీఎస్కేలో ఏం జరుగుతోంది.. మొన్న ఇద్దరు, ఇవాళ మరొక కోచ్ అవుట్!
-
Election Commission: సీజేపీ నిరసనల వేళ కేంద్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం..
ట్రెండింగ్
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!