Trump: ట్రంప్ టెలిప్రాంప్టర్ ఆపరేటర్‌కు భారీ షాక్.. ఎంత పని చేశాడంటే..!
- ట్రంప్ టెలిప్రాంప్టర్ ఆపరేటర్‌కు భారీ షాక్
- ప్రసంగాలపై బెట్టింగ్తో లక్షల్లో లాభం!
- ఉద్యోగం నుంచి తొలగింపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఎన్నో ఏళ్లుగా టెలిప్రాంప్టర్ ఆపరేటర్‌గా పనిచేస్తున్న గాబ్రియెల్ పెరెజ్ తీవ్ర వివాదంలో చిక్కుకున్నారు. ట్రంప్ ప్రసంగాలపై ముందస్తు సమాచారం ఉపయోగించి ఆన్లైన్ ప్రిడిక్షన్ మార్కెట్లో బెట్టింగ్‌లు నిర్వహించి లక్ష డాలర్లకు పైగా లాభం సంపాదించినట్లు ఆరోపణలు రావడంతో వైట్‌హౌస్ విధుల నుంచి తొలగించింది. వైట్ హౌస్ అధికారిక ప్రకటన ప్రకారం.. ఈ వ్యవహారంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు వివరాలు తెలియజేయగా.. ఆయన స్వయంగా గాబ్రియెల్ పెరెజ్‌ను జీతం లేకుండా పరిపాలనా సెలవుపై పంపాలని నిర్ణయించారు.
2016 నుంచి ట్రంప్‌తోనే..
గాబ్రియెల్ పెరెజ్ 2016 అధ్యక్ష ఎన్నికల ప్రచారం నుంచి ట్రంప్‌కు టెలిప్రాంప్టర్ ఆపరేటర్‌గా పనిచేస్తున్నారు. ట్రంప్ ప్రసంగాల పూర్తి పాఠం ముందుగానే అందుబాటులో ఉండే బాధ్యతలో ఉండటంతో.. అదే సమాచారాన్ని దుర్వినియోగం చేసి ఆన్లైన్ ప్రిడిక్షన్ మార్కెట్ కల్షి (Kalshi)లో బెట్టింగ్‌లు పెట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. కల్షి అమెరికా ప్రభుత్వం నియంత్రణలో పనిచేసే ఫెడరల్ ప్రిడిక్షన్ మార్కెట్.
Also Read
ఈ వ్యవహారంపై అమెరికా కమోడిటీ ఫ్యూచర్స్ ట్రేడింగ్ కమిషన్ (CFTC) దర్యాప్తు ప్రారంభించింది. ట్రంప్ చేసిన డజనుకు పైగా కీలక ప్రసంగాలపై ముందస్తు సమాచారం ఆధారంగా బెట్టింగ్‌లు నిర్వహించినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. విచారణకు సంబంధించిన సమాచారం ప్రకారం.. పెరెజ్ ట్రంప్ స్టేట్ ఆఫ్ ది యూనియన్ ప్రసంగం సహా పలు ముఖ్య ప్రసంగాల్లో అధ్యక్షుడు ఏ అంశాలు ప్రస్తావిస్తారనే సమాచారాన్ని ఉపయోగించి భారీ మొత్తంలో లాభాలు ఆర్జించినట్లు తెలుస్తోంది.
ఏబీసీ న్యూస్, సీఎన్ఎన్ కథనాల ప్రకారం.. గాబ్రియెల్ పెరెజ్ దర్యాప్తులో ఉన్న ట్రేడింగ్‌ల ద్వారా 90 వేల డాలర్లకు పైగా సంపాదించినట్లు గుర్తించారు. ప్రస్తుతం ఆ లాభాలను అధికారులు ఫ్రీజ్ చేసినట్లు సమాచారం. ఫెడరల్ రెగ్యులేటర్లతో ఈ కేసు పరిష్కారానికి ఆయన చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.
వైట్ హౌస్ స్పందన
వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ మాట్లాడుతూ.. ఈ ఘటన ‘‘చాలా దురదృష్టకరమైనది.. అవమానకరమైనది’’ అని వ్యాఖ్యానించారు. ‘‘ఇలాంటి విషయాలపై వైట్ హౌస్ అత్యంత కఠినమైన నైతిక ప్రమాణాలు పాటిస్తుంది. అందుకే సంబంధిత ఉద్యోగిని జీతం లేకుండా పరిపాలనా సెలవుపై పంపించాం. గురువారం ఎన్నికల పారదర్శకతపై ట్రంప్ దేశాన్ని ఉద్దేశించి చేసే ప్రసంగానికి మరో వ్యక్తి టెలిప్రాంప్టర్ నిర్వహిస్తారు.’’ అని ఆమె తెలిపారు.
కల్షి స్పందన
కల్షి సంస్థ న్యాయవాది, ఎన్ఫోర్స్మెంట్ విభాగాధిపతి రాబర్ట్ డెనాల్ట్ స్పందిస్తూ.. అనుమానాస్పద ట్రేడింగ్లను తమ నిఘా బృందం వెంటనే గుర్తించి దర్యాప్తు చేసి అమెరికా కమోడిటీ ఫ్యూచర్స్ ట్రేడింగ్ కమిషన్‌కు సమాచారం అందించినట్లు వెల్లడించారు. ఈ ఘటన అమెరికా రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. అధ్యక్షుడి అత్యంత గోప్యమైన ప్రసంగ సమాచారాన్ని వ్యక్తిగత ఆర్థిక లాభాల కోసం వినియోగించారనే ఆరోపణలు ఇప్పుడు విచారణకు దారి తీశాయి.
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?