Thalliki Vandanam: భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. వారికి కూడా ‘తల్లికి వందనం’ వర్తింపు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని అంగన్వాడీ సిబ్బందికి తీపి కబురు అందించింది. పేద, మధ్యతరగతి కుటుంబాలకు బాసటగా నిలిచే ‘తల్లికి వందనం’ పథకాన్ని ఇకపై రాష్ట్రంలోని అన్ని రకాల అంగన్వాడీ టీచర్లు, ఆయాల పిల్లలకు కూడా వర్తింపజేస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటూ, అంగన్వాడీలతో పాటు శానిటేషన్ వర్కర్ల పిల్లలను కూడా ఈ పథకం పరిధిలోకి తెస్తూ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ నిర్ణయంపై రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి హర్షం వ్యక్తం చేశారు. అంగన్వాడీ సిబ్బంది ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న మంచి శుభవార్తను సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వం అందించినట్లు ఆమె పేర్కొన్నారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన విజ్ఞప్తులను పరిశీలించి, ప్రభుత్వం సానుకూలంగా స్పందించి ఈ నిర్ణయం తీసుకుందని స్పష్టం చేశారు. గతంలో అంగన్వాడీలకు జీతాలు పెంచినా, గ్రాట్యుటీ ఇచ్చినా, ఇప్పుడు తల్లికి వందనం పథకాన్ని వర్తింపజేసినా.. అది చంద్రబాబు ప్రభుత్వం హయాంలోనే జరిగిందని ఆమె గుర్తుచేశారు. అంగన్వాడీల సంక్షేమానికి ప్రభుత్వం ఎల్లప్పుడూ ప్రాధాన్యత ఇస్తుందని, ఈ నిర్ణయం సిబ్బందిలో మరింత ఉత్సాహాన్ని, భరోసాను కల్పిస్తుందని మంత్రి అన్నారు.
Also Read
- Maharashtra: మహా ఘోరం.. నదిలో ఇనుప గొలుసులతో తేలియాడిన ప్రేమికుల మృతదేహాలు
- Arvind Kejriwal: సీజేపీ నిరసనల్లో కుటుంబంతో పాల్గొంటున్న కేజ్రీవాల్..
- Penny Stock: ఈ స్టాక్ ధర రూ.2 కంటే తక్కువే.. గత 5 రోజుల నుంచి ఇన్వెస్టర్లకు కాసుల వర్షం..
- CM Vijay: సీఎం విజయ్ ఖాళీ చేసిన తిరుచ్చి స్థానానికి బైపోల్ ఎందుకు జరగలేదు.. కారణమిదేనా?
ఈ నెల 22న నిధుల విడుదల..
ఈ విద్యాసంవత్సరానికి సంబంధించిన ‘తల్లికి వందనం’ నిధులను జూలై 22న విడుదల చేసేందుకు ప్రభుత్వం సర్వం సిద్ధం చేసింది. ఇందుకోసం రూ.10,120.78 కోట్లను విడుదల చేస్తూ విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ ఉత్తర్వులు జారీ చేశారు. 1 నుంచి 12వ తరగతి (ఇంటర్మీడియట్) వరకు చదువుతున్న విద్యార్థుల తల్లుల ఖాతాల్లో ఏటా రూ.15,000 చొప్పున ఈ ఆర్థికసాయం జమ కానుంది. ఇందులో రూ.13,000 నేరుగా తల్లి ఖాతాకు, రూ.2,000 పాఠశాల నిర్వహణకు కేటాయిస్తారు.
ఈ పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 67.47 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరనుండగా, 42.70 లక్షల మంది తల్లుల బ్యాంక్ ఖాతాల్లో నగదు జమ కానుంది. ఇప్పటికే అర్హుల జాబితాను వెరిఫై చేసిన ప్రభుత్వం, జూలై 22న గ్రామ, వార్డు సచివాలయాల్లో లబ్ధిదారుల వివరాలను ప్రదర్శించనుంది. కొత్తగా అడ్మిషన్లు పొందిన ఒకటో తరగతి, ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులకు ఆగస్టు 30 నాటికి వారి తల్లుల ఖాతాల్లో ఈ ఆర్థికసాయాన్ని జమ చేయనున్నారు.
తాజావార్తలు
-
Maharashtra: మహా ఘోరం.. నదిలో ఇనుప గొలుసులతో తేలియాడిన ప్రేమికుల మృతదేహాలు
-
Ponguleti Srinivas :22-ఎ భూములపై ప్రభుత్వం గుడ్‌న్యూస్.. నెల రోజుల్లోనే పరిష్కారం
-
Arvind Kejriwal: సీజేపీ నిరసనల్లో కుటుంబంతో పాల్గొంటున్న కేజ్రీవాల్..
-
Penny Stock: ఈ స్టాక్ ధర రూ.2 కంటే తక్కువే.. గత 5 రోజుల నుంచి ఇన్వెస్టర్లకు కాసుల వర్షం..
-
Anandhi: నిత్యామీనన్‌తో సహా స్టార్ హీరోయిన్లు వద్దనుకున్న కథ.. ఆనంది తలరాత మార్చబోతోందా?
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు