ఏపీలో పెన్షన్ దారులకు నూతన సంవత్సర కానుకను ప్రభుత్వం అందించనుంది. జనవరి 1 నుంచి పెంచిన రూ.250 పెన్షన్‌ను లబ్ధిదారులకు పంపిణీ చేయనుంది. ఈ మేరకు ఒక్కొక్కరికి రూ.2,500 పెన్షన్ అందనుంది. గుంటూరు జిల్లా ప్రత్తిపాడులో సీఎం జగన్ ఈ పెంచిన పెన్షన్ కానుకమొత్తాన్ని లబ్ధిదారులకు ఇచ్చే కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు.
Read Also: నూతనం.. ప్రారంభం.. ఆరంభం.. అంటూ పవన్ కళ్యాణ్ విషెస్
కాగా జనవరి 1 నుంచి ఐదు రోజుల పాటు ఏపీ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ప్రజాప్రతినిధులు, మంత్రులు, జిల్లా యంత్రాంగం పెరిగిన పెన్షన్ పెంపిణీ కార్యక్రమంలో భాగస్వాములు కానున్నారు. కాగా పెన్షన్కోసం రూ.1,570.60 కోట్లను ఏపీ ప్రభుత్వం ఖర్చు చేయనుంది. జనవరిలో కొత్తగా 1.41 లక్షల మంది కొత్తగా పెన్షన్ పరిధిలోకి రానున్నారు. వీరితో కలిపి మొత్తం 61.75 లక్షల మందికి పెన్షన్లు అందనున్నాయి.