CM Jagan: అమరావతిలోని సచివాలయంలో ఏపీ కేబినెట్ సమావేశం జరుగుతోంది. ఈ సందర్భంగా పలు కీలక అంశాలపై చర్చించి మంత్రివర్గం నిర్ణయాలు తీసుకుంది. రూ.2,500 పెన్షన్‌ను వచ్చే నెల నుంచి రూ.2,750కి పెంచుతున్నట్లు కేబినెట్ ప్రకటించింది. ఫలితంగా 62.31 లక్షల మందికి లబ్ధి చేకూరనుంది. జనవరి 1 నుంచి పెంచిన పెన్షన్ అమలు చేయాలని కేబినెట్ నిర్ణయించింది. మరోవైపు వైఎస్ఆర్ పశుబీమా పథకం ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో వర్చువల్ క్లాస్‌లు, ఫౌండేషన్…
ఏపీలో పెన్షన్ దారులకు నూతన సంవత్సర కానుకను ప్రభుత్వం అందించనుంది. జనవరి 1 నుంచి పెంచిన రూ.250 పెన్షన్‌ను లబ్ధిదారులకు పంపిణీ చేయనుంది. ఈ మేరకు ఒక్కొక్కరికి రూ.2,500 పెన్షన్ అందనుంది. గుంటూరు జిల్లా ప్రత్తిపాడులో సీఎం జగన్ ఈ పెంచిన పెన్షన్ కానుకమొత్తాన్ని లబ్ధిదారులకు ఇచ్చే కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. Read Also: నూతనం.. ప్రారంభం.. ఆరంభం.. అంటూ పవన్ కళ్యాణ్ విషెస్ కాగా జనవరి 1 నుంచి ఐదు రోజుల పాటు ఏపీ వ్యాప్తంగా…
హైదరాబాద్‌లో ప్రతి ఏడాది జరిగే నాంపల్లి ఎగ్జిబిషన్ కోసం ఎంతో మంది ఎదురుచూస్తుంటారు. అలాంటి వారికి నిర్వాహకులు శుభవార్త అందించారు. జనవరి 1నుంచి 81వ అఖిల భారత పారిశ్రామిక వస్తు ప్రదర్శనను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. గవర్నర్ తమిళిసై నుమాయిష్‌ను ప్రారంభించనున్నారు. ఈ మేరకు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లోని ఆరు ఎకరాల్లో 1500 స్టాళ్లను నిర్వాహకులు ఏర్పాటు చేశారు. నో మాస్క్ నో ఎంట్రీ రూల్‌ను అమలు చేస్తామని నిర్వాహకులు స్పష్టం చేశారు. Read Also: సమోవా దీవిలో…
విజయవాడలో జనవరి 1, 2022 నుంచి జనవరి 10 వరకు బుక్ ఫెయిర్ జరగనుంది. జనవరి 1న సాయంత్రం 6 గంటలకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఈ ప్రదర్శనను ప్రారంభించనున్నారు. దేశవ్యాప్తంగా 340 మంది పబ్లిషర్స్ ఈ బుక్ ఫెయిర్‌కు వచ్చే అవకాశం ఉందని నిర్వాహకులు తెలిపారు. 32వ బుక్ ఫెయిర్‌ను విజయవాడలోని స్వరాజ్ మైదానం లేదా శాతవాహన కాలేజీలో నిర్వహిస్తామని బుక్ ఫెస్టివల్ సొసైటీ సమన్వయకర్త డి.విజయ్ కుమార్ వెల్లడించారు. 10న ముగింపు సభ, విద్యార్థులకు…
కొత్త సంవత్సరం నుంచి బ్యాంక్ ఖాతాదారులకు షాక్ తగలనుంది. 2022, జనవరి 1 నుంచి ఏటీఎం సెంటర్లలో అపరిమిత లావాదేవీలు జరిపితే ఎక్కువ ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. ఈ మేరకు అపరిమిత లావాదేవీలపై రుసుములు పెంచుతున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. ప్రతి నెలా ఉచిత ఏటీఎం లావాదేవీల పరిమితి దాటితే.. ఎక్కువ రుసుములు వసూలు చేస్తామని తెలిపింది. ఈ మేరకు కస్టమర్ల నుంచి ఫైన్ వసూలు చేసేందుకు దేశంలోని అనేక బ్యాంకులకు ఆర్‌బీఐ అనుమతి…
కరోనా కారణంగా హైదరాబాద్‌లో ఈ ఏడాది నుమాయిష్ నిలిచిపోయింది. అయితే కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో వచ్చే ఏడాది నుమాయిష్‌ను నిర్వహించేందుకు ఎగ్జిబిషన్ సొసైటీ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది జనవరిలో నుమాయిష్ నిర్వహణకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ప్రభుత్వానికి దరఖాస్తు చేసింది. ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన వస్తుందని ఆశిస్తున్నట్లు ఎగ్జిబిషన్ సొసైటీ కార్యదర్శి బి.ప్రభాశంకర్ పేర్కొన్నారు. నుమాయిష్‌కు జీహెచ్ఎంసీ, పోలీసు, ఫైర్ సర్వీసెస్, విద్యుత్, రోడ్ల భవనాల శాఖల నుంచి…