ప్రధానమంత్రి కిసాన్ యోజన పథకం ద్వారా, కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం అర్హత కలిగిన రైతులకు 6 నెలల మొత్తాన్ని అందిస్తుంది. ఈ మొత్తాన్ని 3 వాయిదాలలో ఇస్తారు. ఈ పథకంతో పాటు, ప్రభుత్వం రైతులకు పెన్షన్ ఇచ్చే మరో పథకాన్ని నిర్వహిస్తుంది. ఈ పెన్షన్ పథకం ద్వారా, ప్రభుత్వం రైతులకు ప్రతి నెలా కనీసం రూ. 3000 రూపాయలు ఇస్తుంది. చాలా మంది రైతులకు కిసాన్ పెన్షన్ పథకం గురించి తెలియదు. ప్రధానమంత్రి కిసాన్ మాన్…
శ్రీ సత్యసాయి జిల్లాలో కూటమి ప్రభుత్వం పై తప్పుడు ప్రచారం చేసిన రమేష్ అలియాస్ మాస్ పుష్పను అరెస్ట్ చేశారు పోలీసులు.. నా మానసిక స్థితి బాగోలేక అలా చెప్పాను.. మద్యం మత్తులో మాట్లాడాను.. మా అమ్మకి వితంతు పెన్షన్ రాలేదని అలా వీడియో చేస్తే అయినా.. పెన్షన్ వస్తుందని తప్పుడు ప్రచారం చేశాను అంటున్నాడు రమేష్.. అంతే కానీ, నాకు చంద్రబాబు మీద , పవన్ కల్యాణ్ పై ఎలాంటి కక్ష లేదంటున్నాడు..
అవసరాలకు సరిపడా డబ్బు చేతిలో ఉంటే ఏ చీకుచింతా లేకుండా జీవించొచ్చు. దీనికోసం ముందు నుంచే పొదుపు చేసుకోవడం ప్లాన్ చేసుకోవాలి. అయితే పొదుపు మాత్రమే కాకుండా భవిష్యత్తులో పెన్షన్ కూడా కావాలంటే ఈపీఎఫ్ వంటి పథకాలు అందుబాటులో ఉన్నాయి. అయితే ఇది ఉద్యోగులకు మాత్రమే వర్తిస్తుంది. వారికి రిటైర్మెంట్ తర్వాత పెన్షన్ వస్తుంది. కానీ, అసంఘటిత రంగంలో పనిచేసే కార్మికులకు ఈ వెసులుబాటు ఉండదు. అయితే వీరికి కూడా ప్రయోజనం చేకూరేలా కేంద్ర ప్రభుత్వం ఓ…
Komaram Bheem: పోస్టల్ శాఖ బీపీఎం అవినీతిని అధికారులు బట్ట బయలు చేశారు. మూడు నెలల నుంచి అధికారుల కళ్లుగప్పి మృతి చెందిన ఓ వ్యక్తి ఆసరా పింఛన్ డబ్బులు కాజేసిన పోస్టల్ శాఖ బీపీఎం అవినీతిని బయట పెట్టారు.
కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకు పెన్షన్‌కు సంబంధించిన కీలక ప్రకటన వెలువడింది. పెన్షనర్ల ఖాతాలకు సకాలంలో పెన్షన్, ఫ్యామిలీ పెన్షన్ బదిలీ అయ్యేలా బ్యాంకులు నిర్ధారించాలని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆదేశించింది. అన్ని బ్యాంకులు ప్రతినెలా చివరి తేదీలో లబ్ధిదారుల ఖాతాల్లో పింఛను జమ చేయాలని సూచించారు.
మాజీ ఎమ్మెల్యేలకు నెలవారీ పెన్షన్‌ను రూ.50 వేలకు పెంచుతున్నట్లు సిక్కిం ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్ తమాంగ్ ప్రకటించారు. ప్రస్తుతం మాజీ ఎమ్మెల్యేలకు నెలకు రూ.22 వేలు పింఛన్ అందుతుండగా.. రాష్ట్ర ప్రభుత్వం రెట్టింపు చేసింది.
Andhra Pradesh Pension News: మరికొన్ని రోజుల్లో ఏపీలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంది. ఈ సమయంలో ప్రభుత్వం చేపట్టే పలు కార్యక్రమాలు పరోక్షంగా ఓటర్లను ప్రలోభపెట్టే అవకాశముందని భావించిన ఈసీ.. ఆంక్షలు విధించింది. ఇంటింటికి వెళ్లి పెన్షన్ పంపిణీ చేసే బదులుగా.. గ్రామ, వార్డు సచివాలయాల్లోనే పెన్షన్లు పంపిణీ చేయాలని నిర్ణయించారు. ఏప్రిల్ 3 నుంచి 6 వరకు రాష్ట్రంలో పెన్షన్ల పంపిణీ ప్రక్రియ జరగనుంది. నేడు…
లబ్ధిదారులకు ఇంటి వద్దకే పింఛన్ ఇచ్చే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని ఉదయగిరి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ తెలిపారు. ఈ సందర్భంగా.. వింజమూరు ఎంపీడీవో కిరణ్ కుమార్ కు వింజమూరు మండల నాయకులతో కలిసి కాకర్ల సురేష్ మంగళవారం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా కాకర్ల సురేష్ మాట్లాడుతూ.. వృద్ధులకు, వికలాంగులకు, ఇతర పింఛను లబ్ధిదారులకు ఇంటి వద్దకే వెళ్లి అందించే విధంగా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. పింఛన్ల పంపిణీ పై వైసీపీ…