ఇంటర్మీడియట్ పరీక్షలకు సంబంధించి సుప్రీం కోర్టు లో ఏపీ అఫిడవిట్ దాఖలు చేసింది. ఇంటర్మీడియట్ పరీక్షలు నిర్వహించడం మినహాయించి, ఇంకో విశ్వసించదగ్గ సరైన ప్రత్యామ్నాయం లేదని స్పష్టం చేసింది ఏపీ ప్రభుత్వం. పాఠశాలలు నిర్వహించే “ఇంటర్నల్ పరీక్షల” పై ఇంటర్మీడియట్ బోర్డు కు అజమాయిషీ లేదు. కాబట్టి, “ఇంటర్నల్ పరీక్షల” ఆధారంగా సరైన రీతిలో ఖచ్చితమైన విద్యార్దుల ఉత్తీర్ణతలను నిర్ణయించలేం అని తెలిపింది. 2007, 2011 సంవత్సరాలలో (EAPCET) కామన్ ఎంట్రన్స్ పరీక్షల్లో 25 శాతం వైటేజ్ మార్కులు విద్యార్దులకు అదనంగా ఇచ్చారు. ఆ కారణంగా, విద్యార్దుల భవిష్యత్తును నిర్ణయుంచడంలో ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలు చాలా కీలక పాత్ర పోషిస్తాయు. ఇప్పటికే, మార్చి 31 వ తేదీ నుంచి ఏప్రిల్ 21 వ తేదీ వరకు ప్రాక్టికల్ పరీక్షలు కూడా నిర్వహించడమైనది. రోజు మార్చి రోజు ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం, రెండవ సంవత్సరం (11 వ తరగతి, 12 వ తరగతి) విద్యార్థులకు పరీక్షలు నిర్వహిస్తామని పేర్కొంది ఏపీ ప్రభుత్వం.
అయితే జులై నెల చివరి వారంలో పరీక్షలు నిర్వహించాలని తాత్కాలికంగా నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. 15 రోజులు ముందుగానే విద్యార్థులకు, తల్లితండ్రులుకు పరీక్ష సమయం, పరీక్ష తేదీల పూర్తి సమాచారం అందజేస్తాం. పరీక్ష నిర్వహించే ఒక్కో గదిలో 15 నుంచి 18 మంది విద్యార్దులు కూర్చునే విధంగా ఏర్పాట్లు. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం కు చెందిన మొత్తం విద్యార్దులు 5,12, 959 మంది కాగా, రెండవ సంవత్సరం విద్యార్థులు మొత్తం 5,19, 510 మంది పరీక్షలకు హాజరవ్వనున్నట్లు అఫిడవిట్ లో పేర్కొంది ఏపీ ప్రభుత్వం. ఇంటర్మీడియట్ లో ఆర్ట్స్ విద్యార్దులు 5 సబ్జెక్టులు, సైన్సు విద్యార్థులు 6 సబ్జెక్టులలో పరీక్షలకు హాజరు కావాల్సి ఉంది. మొత్తంగా ఒక్కో విద్యార్థి 5 నుంచి 6 రోజులు పరీక్షలకు హాజరు కావాల్సి ఉంటుంది. పరీక్ష కు హాజరయ్యే విద్యార్థులకు, ఉపాధ్యాయులకు ప్రతి పరీక్ష కేంద్రంలో మాస్కులు, శానిటైజర్లు, ధర్మల్ స్కానర్సు ఏర్పాటు చేస్తామని అఫిడవిట్ లో తెలిపింది ఏపీ ప్రభుత్వం. “కోవిడ్” నిబంధనలకు అనుగుణంగా, ఇతరత్రా అన్ని నిబంధనలు పాటిస్తూ పరీక్షలు నిర్వహిస్తామని ఏపీ ప్రభుత్వం పేర్కొంది.