ఇంటర్మీడియట్ పరీక్షలకు సంబంధించి సుప్రీం కోర్టు లో ఏపీ అఫిడవిట్ దాఖలు చేసింది. ఇంటర్మీడియట్ పరీక్షలు నిర్వహించడం మినహాయించి, ఇంకో విశ్వసించదగ్గ సరైన ప్రత్యామ్నాయం లేదని స్పష్టం చేసింది ఏపీ ప్రభుత్వం. పాఠశాలలు నిర్వహించే “ఇంటర్నల్ పరీక్షల” పై ఇంటర్మీడియట్ బోర్డు కు అజమాయిషీ లేదు. కాబట్టి, “ఇంటర్నల్ పరీక్షల” ఆధారంగా సరైన రీతిలో ఖచ్చితమైన విద్యార్దుల ఉత్తీర్ణతలను నిర్ణయించలేం అని తెలిపింది. 2007, 2011 సంవత్సరాలలో (EAPCET) కామన్ ఎంట్రన్స్ పరీక్షల్లో 25 శాతం వైటేజ్…