Deputy CM Pawan: అమరావతిలో సాలిడ్, లిక్విడ్ రిసోర్స్ మేనేజ్మెంట్ – ఎస్ఎల్ఆర్ఎం వర్క్ షాపులో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఎస్ఎల్ఆర్ఎంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన అధికారులు.. భీమవరం, పిఠాపురం, గొల్లప్రొలులో ఎస్ఎల్ఆర్ఎం ప్రాజెక్టు అమలు చేస్తున్నట్టు వెల్లడించారు. చెత్త నుంచి వివిధ ఉత్పతులకు ముడి సరుకు తయారు చేయొచ్చని అధికారులు తెలిపారు. డ్రైనేజ్ టు డైమండ్ అనే కాన్సెప్టుతో ఎస్ఎల్ఆర్ఎం ప్రాజెక్టును రూపొందించామని ఎస్ఎల్ఆర్ఎం రిసోర్స్ ప్రతినిధి శ్రీనివాసన్ పేర్కొన్నారు.
Read Also: Fake Ginger Garlic Paste: పెరుగుతున్న నకిలీ ఉత్పత్తులు.. 7.3 టన్నుల అల్లం పేస్ట్ స్వాధీనం
ఈ వర్క్ షాప్ లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. పంచభూతాల్లో నీరు ఉంది.. కానీ ఆ నీటిని మనం పూజలకే ఉపయోగిస్తాం తప్ప.. నీటిని శుభ్రంగా ఉంచం.. 12 గంటల్లో చెత్తను కలెక్ట్ చేయగలిగితే చెత్తే సంపద అవుతుంది.. పనికి రాని చెత్త వేరే అవసరాలకు సంపదగా మారుతుంది.. శ్రీనివాసన్ గత రెండు దశాబ్దాలుగా ఎస్ఎల్ఆర్ఎం ప్రాజెక్టు మీద పని చేస్తున్నారు.. పిఠాపురంలో తొలిసారిగా ఎస్ఎల్ఆర్ఎం ప్రాజెక్టు చేపట్టనున్నాం.. ప్రజలూ ఎస్ఎల్ఆర్ఎం ప్రాజెక్టులో భాగస్వాములు కావాలి అని ఆయన పిలుపునిచ్చారు. పంట కాల్వ కన్పిస్తే చాలు దాన్ని డంపింగ్ యార్డుగా మార్చేస్తున్నారు.. ఈ ప్రాజెక్టుపై అవగాహన పెంచేందుకు మాస్టర్ ట్రైనర్సును సిద్దం చేస్తాం.. ఎస్ఎల్ఆర్ఎం ప్రాజెక్టును నా కార్యాలయంలో.. మా పార్టీ ఆఫీసులో ప్రారంభిస్తాం.. ఎస్ఎల్ఆర్ఎం ప్రాజెక్టును అమలు చేయగలిగితే పంచాయతీలు, మున్సిపాల్టీలకు ఆదాయం వస్తుంది అని ఉప ముఖ్యమంత్రి పవన్ అన్నారు.
Read Also: CPM Party: 2025 నాటికి ఇండియాను అఖండ హిందూ దేశంగా ప్రకటించాలని బీజేపీ ప్లాన్..!
ఇక, ఎస్ఎల్ఆర్ఎం ప్రాజెక్టును రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తే రూరల్ ప్రాంతంలో ఏడాదికి 2, 600 కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. 2.45 లక్షల మందికి 9 వేల రూపాయల జీతం ఇచ్చి ఉపాధి కల్పించవచ్చు.. ఇప్పటి వరకు చిన్న చిన్న గ్రామాల్లో మాత్రమే అమలు చేశారు.. ఈ ప్రాజెక్టుకు మరింత విస్తృత కల్పించాలి.. పంచాయతీలకు డబ్బులు లేవు.. పంచాయతీలను గత ప్రభుత్వం నిర్వీర్యం చేశారు.. ప్రక్షాళన చేయాలి.. స్వయం సమృద్ధి ఉండేలా పంచాయతీలను రూపొందించాల్సి ఉంటుంది.. భీమవరం డంపింగ్ యార్డ్ విషయంలో కూడా ఎస్ఎల్ఆర్ఎం ప్రాజెక్టు అమలు చేస్తామన్నారు. భీమవరం మున్సిపల్ శాఖ పరిధిలో ఉంటుంది.. ఈ ప్రాజెక్టు అమలు విషయమై మంత్రి నారాయణతో మాట్లాడుతాం.. చెత్తలో కూడా ఐశ్వర్యం ఉందని చెప్పడమే ఈ ప్రాజెక్టు యొక్క ముఖ్య ఉద్దేశం అని ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ తెలిపారు.