CPM Party: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సీపీఎం విస్తృత సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో సీపీఎం పోలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు, ఎం.ఏ.బేబీ, రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు, రాష్ట్ర నాయకుడు మధు, కేంద్ర కమిటీ సభ్యుడు ఎం,ఏ గఫూర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీపీఎం పోలిట్ బ్యూరో సభ్యుడు ఎంఏ బేబీ మాట్లాడుతూ.. హిందూ రాష్ట్ర అనే ఆలోచన ఉన్న ఆర్ఎస్ఎస్ విధానాలతో కూడిన దేశం వైపు మార్చాలని చూస్తున్నారు.. 2025 నాటికి ఇండియాను మైనారిటీ వ్యతిరేక దేశంగా.. అఖండ హిందూ దేశంగా ప్రకటించాలని చూస్తోంది భారతీయ జనతా పార్టీ అని ఆయన ఆరోపించారు. 2025 నాటికి ఆర్ఎస్ఎస్ స్థాపించి వందేళ్లు అవుతుందని తెలిపారు.
Read Also: Aparna Vastare Death: ప్రముఖ లేడీ యాంకర్ మృతి.. సంతాపం తెలిపిన సీఎం!
ఇక, మతరాజ్య నిర్మాణానికి 2024 ఎన్నికలను ఉపయోగించుకునేందుకు భారతీయ జనతా పార్టీ ప్రయత్నించింది అని సీపీఎం పోలిట్ బ్యూరో సభ్యుడు ఎంఏ బేబీ తెలిపారు. ప్రతిపక్ష పార్టీలు ఒకరితో ఒకరు మాట్లాడుకునేందుకు సిద్ధంగా లేరు.. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇప్పటికీ ఆపాదించబడిన కేసులో జైలులో ఉన్నారు.. నరేంద్ర మోడీ సీట్లు పార్లమెంటులో 240కి పడిపోయాయి.. మోడీకి రెండు ఊతకర్రలుగా చంద్రబాబు, నితీష్ కుమార్ ఉన్నారు అని ఆయన ఎద్దేవా చేశారు. తమిళనాడులో ఒక్క సీటు కూడా గెలవకుండా ఓటింగ్ పర్సంటేజీ పెంచుకోవాలని చూసింది బీజేపీ.. గతంలో విడిపోయిన కూటమి మరోసారి కలిస్తేనే కమలం పార్టీ ఏపీలో స్ధానం సంపాదించింది.. ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ కూచుని మాట్లాడుకోవడం లేదు.. బీజేపీ కేరళలో గెలిచిన తిరుచూరు స్థానంలో ఓటు పర్సంటేజీ సీపీఎంకు తగ్గలేదు.. యూడీఎఫ్ ఓటింగ్ తగ్గడమే బీజేపీ కేరళలో గెలవడానికి కారణం అయిందని ఎంఏ బేబీ పేర్కొన్నారు.