ఎన్నికల ముందు 143 వాగ్దానాలతో పాటు ఈవీఎంలను లోబర్చుకుని చంద్రబాబు గెలిచారని, గెలిచి ప్రజలకు వెన్నుపోటు పొడుస్తున్నారని వైసీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్ర శేఖర్ ఆరోపించారు. శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వెన్నుపోటు దినం రోజు పెద్ద ఎత్తున ప్రజలు రోడ్డు పైకి వచ్చారని చెప్పారు. ప్రతి కార్యక్రమంలో జగన్‌ని నిందిస్తున్నారని.. అవాకులు చెవాకులు పేలుతున్నారని మండిపడ్డారు. మంత్రి ఆనం రామనారాయణరెడ్డి దిగజారుడు మాటలు మాట్లాడుతున్నారని.. దిగజారుడు మాటలు మాట్లాడటానికి సిగ్గు అనిపించడం…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. కేంద్ర ప్రభుత్వం ఏపీకి 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదల చేసింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గ్రామీణ స్థానిక సంస్థల కోసం 15వ ఆర్థిక సంఘం గ్రాంట్స్ విడుదల చేసింది. ఈ గ్రాంట్స్ కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రూ.1,121.20 కోట్ల నిధులు విడుదలయ్యాయి. ఇందులో పంచాయతీలకు 70%, మండల పరిషత్తులకు 20%, జిల్లా పరిషత్తులకు 10% కేటాయించింది.
Minister Seethakka : అధికారులంతా నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించాలన్నారు మంత్రి సీతక్క. ఎలాంటి ఒత్తిళ్లకు లొంగకుండా స్వేచ్ఛగా, నిర్భయంగా పని చేయండని ఆమె వ్యాఖ్యానించారు. మీ మీద ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోండని, నిబద్ధతతో పనిచేసి శాఖ గౌరవాన్ని నిలబెట్టాలన్నారు. శాఖకు వన్నె తెచ్చేలా పనిచేయాలని ఆమె సూచించారు. శాఖపరంగా వాస్తవాలనే నివేదించండని, మా మెప్పుకోసం వాస్తవాలను దాచి పెట్టొద్దన్నారు. అధికారులు, అమాత్యులు వేరు వేరు కాదని, మీరు పొరపాట్లు చేసి మమ్మల్ని ఇబ్బందుల పాలు చేయొద్దన్నారు మంత్రి…
భీమవరం మున్సిపల్ శాఖ పరిధిలో ఉంటుంది.. ఈ ప్రాజెక్టు అమలు విషయమై మంత్రి నారాయణతో మాట్లాడుతాం.. చెత్తలో కూడా ఐశ్వర్యం ఉందని చెప్పడమే ఈ ప్రాజెక్టు యొక్క ముఖ్య ఉద్దేశం అని ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ తెలిపారు.