Fake Ginger Garlic Paste: నకిలీ అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేస్తున్న ఫ్యాక్టరీ పై సైబరాబాద్ SOT పోలీసుల దాడులు నిర్వహించారు. 15 లక్షల విలువ గల 7.3 టన్నుల పేస్ట్ స్వాధీనం చేసుకున్నారు. రాజేంద్రనగర్ బుద్వేల్ లోని గ్రీన్ సిటీ లో అప్న ఎంటర్ప్రైసెస్ లో అధికారులు సోదాలు నిర్వహించారు. ఫ్యాక్టరీ ని నిర్వహిస్తున్న అమీర్ నిజాన్ అనే వ్యక్తిని అదుపులో తీసుకున్నారు. ప్రమాదకర సింథటిక్ కలర్స్, యాసిడ్స్, కెమికల్ వాటర్ వాడుతున్నట్లు నిర్ధారణ రావడంతో ఫుడ్ సేఫ్టీ అధికారి పరీక్షలు జరుపుతున్నట్లు సమాచారం.
Read also: CM Revanth Reddy: జూలై 16న కలెక్టర్లు, ఎస్పీలతో రేవంత్ రెడ్డి సమావేశం.. తొమ్మిది అంశాలపై చర్చ..
సమాజంలో నకిలీ ఉత్పత్తులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. దీనిపై ఫుడ్ సేప్టీ అధికారులు చర్యలు తీసుకుంటున్న హోటల్ యాజమాన్యం మాత్రం పెడచెవిన పెడుతు నకిలీ పేస్టులను, కుల్లిన మాంసాలను విక్రయిస్తూ ప్రజల ప్రాణాలతో చలగాటం ఆడుతున్నారు. కల్తీ ఆహార పదార్థాలను విక్రయిస్తున్న వారిపై పోలీసులు, ఫుడ్ సేఫ్టీ అధికారులు చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఎక్కడో ఒక చోట నకిలీలు తయారు చేస్తూనే ఉన్నాయి. నకిలీ ఉత్పత్తులపై అధికారులు కఠినంగా వ్యవహరిస్తున్నప్పటికీ తయారీదారులు వెనక్కి తగ్గడం లేదు. అధికారులకు దొరక్కుండా చాలా రహస్యంగా నకిలీ ఉత్పత్తులను తయారు చేసి మార్కెట్లోకి విడుదల చేస్తున్నారు. దీనిపై సైబరాబాద్ ఎస్‌ఓటీ పోలీసులు ఉక్కుపాదం మోపారు. అలాంటి వారిపై కఠినచర్యలు తీసుకుంటున్నారు. ఇక తాజాగా సైబరాబాద్ పరిధిలో నకిలీ పదార్థాలు పట్టుకుని విక్రయిస్తున్న వారిని అదుపులోకి తీసుకున్న ఘటన నగరంలో చోటుచేసుకోవడంత భోజన ప్రియులు భయాందోళన చెందుతున్నారు. ఏ రెస్టారెంట్ కి వెళ్లి తినాలన్నా బెంబేలెత్తుతున్నారు.
Driving License: మాన్యువల్ పద్ధతికి ఇక చెక్.. డ్రైవింగ్ లైసెన్స్కు కొత్త పరీక్ష..