AP Cabinet: ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం వాయిదా పడింది. ఆగస్టు 2వ తేదీన జరగాల్సిన కేబినెట్ సమావేశం వచ్చే నెల 7న జరగనున్నట్లు తెలుస్తుంది. కాగా ఆగస్టు 1వ తేదీన సీఎం చంద్రబాబు సత్యసాయి జిల్లాలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంతో పాటు కర్నూలు జిల్లాలోన శ్రీశైలం మల్లన్నను దర్శించుకోని శ్రీశైల ప్రాజెక్ సందర్శనకు వెళ్తున్న నేపథ్యంలో మంత్రివర్గ సమావేశం వాయిదా వేసినట్లు సమాచారం. కాగా, ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈసారి జరిగే సమావేశంలో రాష్ట్ర కేబినెట్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేసే దిశగా పలు కీలక పథకాలతో పాటు ఉచిత బస్సు ప్రయాణం, ఇళ్ల పంపిణీ లాంటి పథకాలకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలపనున్నట్లు తెలుస్తుంది.
Read Also: Game Changer: దిల్ రాజా ఆ విషయం సీరియస్గా తీసుకున్నట్టున్నాడే?
కాగా, ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరగనున్న ఈ మంత్రివర్గ సమావేశానికి సంబంధించి వివిధ శాఖల నుంచి వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. ఈ కాబినేట్ భేటీలోనే ఏపీ సర్కార్ పలు కీలక నిర్ణయాలు తీసుకునే ఛాన్స్ ఉంది. దీంతో పాటు కీలక బిల్లులకు ఆమోదం తెలిపే అవకాశాలు ఉన్నాయి.