AP Cabinet: ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం వాయిదా పడింది. ఆగస్టు 2వ తేదీన జరగాల్సిన కేబినెట్ సమావేశం వచ్చే నెల 7న జరగనున్నట్లు తెలుస్తుంది. కాగా ఆగస్టు 1వ తేదీన సీఎం చంద్రబాబు సత్యసాయి జిల్లాలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంతో పాటు కర్నూలు జిల్లాలోన శ్రీశైలం మల్లన్నను దర్శించుకోని శ్రీశైల ప్రాజెక్ సందర్శనకు వెళ్తున్న నేపథ్యంలో మంత్రివర్గ సమావేశం వాయిదా వేసినట్లు సమాచారం.
తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో కళ్యాణమస్తు కార్యక్రమం తిరిగి ప్రారంభం కానుంది. ఈ మేరకు ఈ కార్యక్రమం ప్రారంభానికి ముహూర్తం ఖరారైంది. కల్యాణమస్తు కార్యక్రమాన్ని ఆగస్టు 7 నుంచి రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించేందుకు టీటీడీ సిద్ధమవుతోంది. ఆగస్టు 7న ఉదయం 8:07 గంటల నుంచి 8:17 గంటల మధ్య 26 జిల్లాల్లో కల్యాణమస్తు నిర్వహిస్తామని టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. సామూహిక వివాహ మహోత్సవంలో వధూవరులు ఒక్కటయ్యేందుకు జూలై 1 నుంచి 20 వరకు అన్ని జిల్లా కేంద్రాల్లో…