Dil Raju is Busy with Game Changer Meetings: స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు గురించి తెలుగు ప్రేక్షకులు ఎవరికీ పరిచయం చేయాల్సిన అవసరం లేదు. చాలా సినిమాలు డిస్ట్రిబ్యూట్ చేసిన ఆయన దిల్ సినిమాతో నిర్మాతగా మారాడు. అభిరుచి కలిగిన సినిమాలు నిర్మిస్తాడు అనే పేరున్న ఆయన కమర్షియల్ హిట్లు కొట్టి సక్సెస్ఫుల్ నిర్మాతలలో ఒకరిగా నిలిచాడు. అయితే ఇప్పుడు అసల సంగతి ఏమిటంటే ప్రస్తుతం ఆయన శంకర్ దర్శకత్వంలో రాంచరణ్ హీరోగా గేమ్ చేంజర్ అనే ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ దాదాపు పూర్తి కావచ్చింది. కేవలం రామ్ చరణ్ లేని సీన్లు ఇంకా పది పదిహేను రోజులు షూట్ చేయాల్సి ఉందని శంకర్ స్వయంగా చెప్పాడు. ఇప్పుడు అందులో కూడా కొంత షూటింగ్ పూర్తి చేశారు, మరికొంత షూటింగ్ పూర్తి చేసే పనిలో ఉన్నారు. అయితే ఈ మధ్యకాలంలో ఒక న్యూస్ వైరల్ అయింది. అదేంటంటే శంకర్ ఈ సినిమాకి సంబంధించిన ఎడిట్ సూట్ చెన్నైలో పెట్టుకున్నాడని దిల్ రాజుకు కానీ హీరో రామ్ చరణ్ టీంకి గాని ఆ ఎడిట్ సూట్ లోకి అసలు ప్రవేశమే లేదన్నట్లుగా ప్రచారం మొదలైంది.
Prabhas: కల్కి నిర్మాతలకు ఎన్ని కోట్లు లాభం వచ్చిందంటే..?
దీంతో రాంచరణ్ అభిమానులు భారతీయుడు 2 రిజల్ట్ చూసిన తర్వాత అయినా దిల్ రాజు కాస్త మేలుకోవాలని శంకర్ ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ పనులను ఆయన కూడా పర్యవేక్షించాలని కోరారు. అయితే ఆయన ఆ విషయాన్ని సీరియస్గా తీసుకున్నాడో లేక రెగ్యులర్ మీటింగో తెలియదు కానీ నిన్న హైదరాబాదులో గేమ్ చేంజర్ సినిమాకి సంబంధించిన మీటింగ్ జరిగినట్లుగా తెలుస్తోంది. ఈ విషయం ఎలా బయటకు వచ్చిందంటే అలరాటి రామచంద్రుడు అనే సినిమా యూనిట్ ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ పెట్టుకుంది. దిల్ రాజు తన స్నేహితుడికి స్నేహితుడు అని చెబుతూ సదరు సినిమా నిర్మాత ఆయన్ని ఈ ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ కి ఆహ్వానించాడు. చివరి నిమిషం వరకు ఆయన వస్తాడు వస్తాడు అనుకుంటే చివరి నిమిషంలో రావట్లేదని చెప్పారు. అలా చెబుతూ గేమ్ చేంజర్ కి సంబంధించిన ఒక కీలకమైన మీటింగ్ జరుగుతోందనే విషయాన్ని వెల్లడించారు. సో ఫాన్స్ అభ్యర్థనను దిల్ రాజు ఏమైనా కన్సిడర్ చేసి సీరియస్గా తీసుకుని ఆ విషయంలో మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాడా? అని చర్చ ఇప్పుడు మొదలైంది.