Madanapalle Sub Collector Office incident: అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టరేట్ లో రికార్డుల కాల్చివేతకు సంబంధించిన కేసులో అధికారుల విచారణ ముమ్మురంగా కొనసాగుతోంది. రెవెన్యూ శాఖ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోడియం.. నిన్నటి నుంచి ఇక్కడే మకాం వేసి భూ వివాదాలపై ఆరా తీస్తున్నారు. ఇక, రేపు సాయంత్రం 4 గంటల నుంచి ప్రజల నుంచి భూ వివాదాలపై ఫిర్యాదులు స్వీకరించనున్నారు. జిల్లా కలెక్టర్ శ్రీధర్, ఎస్పీ విద్యాసాగర్ నాయుడు, సీఐడీ అధికారులు కలెక్టర్ కార్యాలయంలోనే మకాం వేశారు. 25 అంశాలకు సంబంధించి దాదాపు 1,000 పైగా ఫైలు పూర్తిగా కాలిపోయినట్లు అధికారులు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. సగం కాలిపోయిన మరో ఏడువందల రికార్డులను రెవెన్యూ అధికారులకు అప్పగించి వాటికి సంబంధించిన వివరాలు సేకరిస్తున్నారు.
ఇక, ఈ అంశంలో కుట్ర కోణం దాగు ఉందనే వివరాల మేరకు.. ఘటన జరిగిన విషయం తెలిసిన ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వలేదని ఆరోపణలపై మదనపల్లి సీఐ వలిబసు వీఆర్ కు పంపారు. ఆదివారం రాత్రి నైట్ డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్ హరి ప్రసాదు, భాస్కర్ ను సస్పెండ్ చేశారు. ఇక ఎన్నికల ముందు ఆర్డీవోగా పనిచేసిన మురళి ఘటనకు రెండు రోజుల ముందు మదనపల్లిలోనే మకాం వేసి కార్యాలయం కూడా వచ్చి వెళ్లినట్లు అధికారులు గుర్తించారు. ఆయన ఎందుకు రావాల్సి వచ్చింది? ఏంటి? అనే దానిపై ఆరా తీయడానికి మూడు రోజుల నుంచి అతని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అతనితోపాటు ఇటీవల బదిలీ అయిన ఆర్డీవో హరిప్రసాద్, వీఆర్ఏ రమణయ్య ను కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
Read Also: Nitish Kumar: ‘‘ మీరు మహిళ, మీకు ఏం తెలియదు’’.. ఆర్జేడీ ఎమ్మెల్యేపై సీఎం ఫైర్..
మరోవైపు, రాత్రి ఘటన జరిగిన సమయంలో కార్యాలయంలో ఉన్న సీనియర్ అసిస్టెంట్ గౌతమ్ ను కూడా మూడు రోజుల నుంచి పోలీసు అధికారులు, జిల్లా రెవెన్యూ యంత్రంగా విచారణ చేస్తోంది. ఇంకా ఎవరెవరు ఈ కుట్రలో పాలుపంచుకున్నారని దానిపైన జిల్లా రెవెన్యూ యంత్రాంగం పోలీసులు పూర్తిస్థాయిలో దృష్టి సారించారు. ఉదయం అగ్నిమాపకశాఖ రాష్ట్ర డైరెక్టర్ వెంకటరమణ సబ్ కలెక్టర్ కార్యాలయానికి వచ్చి సంఘటన తీరును పరిశీలించారు. ఆ రోజు సంఘటన జరిగినప్పుడు ఏ విధంగా జరిగింది సమాచారం ఎవరిచ్చారు అనేదానిపై ఆరా తీశారు.. ఇక ఈ కేసులో దస్త్రాలు కాలిపోవడానికి ప్రధాన సూత్రధరునిగా అనుమానిస్తున్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రధాన అనుచరుడు మాధవరెడ్డి కోసం పోలీసులు గాలిస్తున్నారు. నిన్న ఆయన ఇంట్లోకి వెళ్లి సోదలు నిర్వహించగా తప్పించుకొని పారిపోయినట్లు తెలుస్తోంది. ఆయన ఏ ప్రాంతంలో ఉన్నాడు ఏంటి అనేదానిపై పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు.
Read Also: India Passport Rank: అత్యంత శక్తిమంతమైన పాస్‌పోర్టుల్లో భారత్ ర్యాంక్ ఇంత దారుణమా.?
అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు కేసులో 35మందికిపైగా అనుమానితులను గుర్తించినట్లు తెలిపారు. వారందరిని అదుపులో తీసుకుని విచారిస్తున్నామని పోలీసు శాఖతో పాటు పనిచేసినా వివిధ శాఖల దర్యాప్తుపై నివేదిక త్వరలో రానునుందని.. ఆ నివేదిక తరువాత మరింత దూకుడుగా కేసులోముందుకు వెలుతామన్నారు. ఇక ఉద్యోగి గౌతమ్ బీరువాలో ఇంజెన్ ఆయిల్ ఉన్నట్లు విచారణ తెలిసిందని.. అయితే అది వ్యక్తగత వాహనం కోసం తెచ్చుకున్నాట్లుగా విచారణలో గౌతమ్ తెలిపాడని.. కానీ, దానివల్ల ప్రమాదం జరిగిందా? లేదా? అనేదానిపై దర్యాప్తు సాగుతోందన్నారు. ఇక సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి సారించిన నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అంతా ఈ ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ చేస్తుంది.